IVF center scam: అమ్మతనాన్ని అమ్ముకుంటున్న IVF సెంటర్లు.. ఆ చీకటి దందా షాకింగ్ సీక్రెట్స్ ఇవే!

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గిపోవడం, అలాగే స్త్రీలలో బలహీనమైన అండాలు ఉత్పత్తి, ఇతర అనారోగ్య కారణాల వల్ల సహజంగా ఫలదీకరణ జరగడం లేదు. దీంతో IVF సెంటర్ల చెబుతున్నది ఏంటి? చేసేది ఏంటో ఇప్పుడు చూద్ధాం..

New Update
IVF centers scam

పేరెంట్స్ అవ్వాలని కోరికను క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నాయి IVF సెంటర్లు. పెద్ద పెద్ద మెడిసిన్ చదువులు చదివి అమ్మతనాన్ని అమ్మకుంటున్నారు డాక్టర్లు. అసలు 10ఏళ్ల కింద ఈ పదం కూడా ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం సిటీల్లో సందుకో ఫెర్టిలిటీ సెంటర్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మారిని జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది దంపతులకు పిల్లలు పుట్టడం లేదు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గిపోవడం, అలాగే స్త్రీలలో బలహీనమైన అండాలు ఉత్పత్తి, ఇతర అనారోగ్య కారణాల వల్ల సహజంగా ఫలదీకరణ జరగడం లేదు. దీంతో IVF సెంటర్ల చెబుతున్నది ఏంటి? చేసేది ఏంటో ఇప్పుడు చూద్ధాం..

డిజైన్ చేసుకొని పిల్లలకు బర్త్

కలర్, ఎత్తు, రూపం, తెలివితేటల అన్నీ ఎలా కావాలంటే అలా మీకు పిల్లల్ని పుట్టిస్తామని ప్యాకేజీలు ముందు పెడతారు. సంతానలేమి సమస్యలకు IVF, స్పెర్మ్ డొనేషన్, సరోగసీ అనే మూడు పద్దతులు ఉన్నాయి. IVF అంటే సహజంగా అండం, శుక్రకణాలు కలవలేని పరిస్థితిలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ప్రక్రియ చేస్తారు. ఇందులో తల్లిదండ్రుల అండం, స్పెర్మ్ వాడుతారు. ఇక స్పెర్మ్ డొనేషన్ అంటే స్త్రీభాగస్వామికి స్పెర్మ్ క్వాలిటీ సరిగా లేకుంటే మరో వ్యక్తి నుంచి శుక్రకణాలు తీసుకుంటారు. ఇదే ప్రక్రియను తల్లి అండం తీసుకుని మరో మహిళ గర్భసంచిలో ప్రవేశపెడితే దాన్ని సరోగసీ అంటారు. వీటితో పాటు ఇప్పుడు IVFలో కొత్త తరహా విధానం వచ్చింది. ఎలాంటి పిల్లలు కావాలో డాక్టర్లకు చెబితే వాళ్లు ఆయా లక్షణాలు ఉన్న వ్యక్తల నుంచి స్పెర్మ్, ఎగ్ తీసుకొని పిల్లలు కావాలనుకునే వారి గర్భంలోకి ప్రవేశపెడతారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో జరిగిన ఘరానా మోసం కూడా ఇలాంటిదే. దంపతులను నుంచి మంచి పిల్లాడిని పుట్టిస్తామని రూ.40 లక్షలు తీసుకొని.. క్యాన్సర్ రోగి స్పెర్మ్ తీసుకొని పిల్లాడిని పుట్టించారు. అంతేకాదు.. సరోగసీ అని చెప్పి దంపతుల దగ్గర లక్షలు కాజేసి.. ఇతరులకు సహజంగా జన్మించిన పిల్లలను విక్రయించి అప్పగిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 270 IVF సెంటర్లు

ఐవీఎఫ్ చికిత్సలో సక్సెస్ సాధారణంగా ఎటువంటి గ్యారంటీ ఉండదు. కానీ కొన్ని కేంద్రాలు '100% 'గ్యారెంటీ' అని ప్రచారం చేస్తూ, విఫలమైనా.. డబ్బులు తిరిగి ఇవ్వకుండా, మరింత డబ్బు చెల్లిస్తే మళ్లీ ప్రయ త్నించొచ్చనని నమ్మిస్తూ నట్టేట ముంచుతున్నాయి. ఒక ఐవీఎఫ్ సైకిల్‌కు ప్రాథమిక దశలోనే కనీసం రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని కేంద్రాలు అయితే, 'ప్యాకేజీలు" అని చెప్పినూ. 10 లక్షల వరకు దండుకుంటున్నాయి. పిల్లల కోసం కొందరు దంపతులు తమ ఇండ్లు . భూములు అమ్ముకు న్న ఘటనలూ ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 270 ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఐవీఎఫ్ విధానంలో సంతానం పొందే ట్రీట్‌మెంట్‌కు హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ప్రధాన కేంద్రంగా మారింది. కరీంనగర్‌లో పది వరకు ఈ సెంటర్లు ఉన్నాయి. ఐవీఎఫ్ విధానంలో సంతానం కలగక పెయిలైతే డాక్టర్లు మీరు మందులు సరిగ్గా వాడలేదు' అని సింపుల్గా తప్పించుకుంటున్నారు. 

చేయాల్సింది చేయకుండా డబ్బుల కోసం

కొన్ని జంటలకు చిన్న సమస్య ఉన్నప్పుడు ఐయూఐ (ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్) పద్ధతిలో గర్భం దాల్చేలా చేస్తారు. ఇది తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. సాధారణంగానే గర్భధారణ ప్రక్రియ ముగుస్తుంది. దీన్ని ఐవీఎఫ్ పద్ధతిని చేయడానికి ముందుగా నిర్వహిస్తారు. ఈ విధానంలో భర్త నుంచి స్పెర్మ్ ని కలెక్ట్ చేసి దాన్ని డైరెక్ట్ గా భార్య యుటెరస్‌లోకి ఎగ్స్ రిలీజ్ ఆయిన సమయానికి పంపిస్తారు. అప్పుడు ఫర్టిలైజేషన్ జరిగే అవకాశం ఉంది. దీనిలో స్పెర్మ్‌ని పంపించగానే అది ఫాలోపియన్ ట్యూబ్స్ వద్దకి వెళ్తుంది. అయితే చాలా ఐవీఎఫ్ సెంటర్లు ఐయూఐను ఏదోనామమాత్రంగా చేస్తున్నాయి. దీంతో దంపతులను ఐవీఎఫ్ పద్ధతికే వెళ్లేలా ప్రోత్సహిస్తుంటారు.

పుట్టిన బిడ్డకు వాళ్లు తల్లిదండ్రులు కాదు!

ఐవీఎఫ్ పద్ధతిలో భార్య ఎగ్స్‌ని తీసి.. ఫర్టిలైజేషన్ చేస్తారు. సర్జికల్ ప్రొసీజర్ ద్వారా నీడిల్‌తో అండం తీసి, ఆ తర్వాత భర్త స్పెర్మ్ ని కలెక్ట్ చేసి ఈ రెండింటినీ కూడా ఫర్టిలైజ్ చేస్తారు. అనంతరం ఎంబ్రియోని మహిళ కడుపులోకి పంపిస్తారు. ఈ ట్రీట్మెంట్‌లో చాలా స్టెప్స్ ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. ఈ క్రమంలో కొన్ని జంటలకు సంబంధించి ఎగ్స్ వారివి కాకుండా ఇతరుల నుంచి తీసుకోవడం. కొందరు డాక్టర్లు భర్త స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా తల్లిదండ్రులవుతారని తప్పుదారి పట్టిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భర్తది కాకుండా మరొకరి స్పెర్మ్ ప్రవేశపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సరోగసీ చట్టంలో ఏంముంది..

మన దేశంలో సరోగసీ (అద్దె గర్భం) విధానంపై పరిమితులు ఉన్నాయి. సరోగసీ (నియంత్రణ) చట్టం -2021 పేరుతో కేంద్రం ప్రభుత్వం 2012 జనవరి నుంచి నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం.. కమర్షియల్ పద్ధతిలో, అంటే డబ్బుల కోసం సరోగసీ విధానంలో పిల్లలను కనడం చట్టవిరుద్ధం. కేవలం నిస్వార్ధ పద్ధతిలో పిల్లలను కనేందుకు పరిమిత సంఖ్యలో అనుమతి ఉంది. కానీ, చాలా ఫెర్టిలిటీ సెంటర్లు కమర్షియల్ పద్ధతిలో సరోగసీని నడిపిస్తున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా, సరోగసీపేరు చెప్పి నమ్మించి... వేరే వాళ్ల పిల్లలను కొని జంటలకు అప్పగిస్తున్నారు. 

ఏఆర్టీ చట్టం, బోర్డు ఉన్నా..!!

అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం -2021 (ఏఆర్టీ చట్టం) ప్రకారం ప్రతి రాష్ట్రంలో స్టేట్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసీబోర్డు' ఉండాలి. ఈ బోర్డు రాష్ట్రంలోని ఫెర్టిలిటీ కేంద్రాలను పర్యవేక్షించడం, రిజిస్ట్రేషన్లు ఇవ్వడం, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి. అయితే, రాష్ట్రంలో ఈ బోర్డు నామమాత్రంగానే ఉందనే విమర్మలున్నాయి. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్‌లో రాష్ట్రానికి సంబంధించిన 2022లో ఏర్పాటు చేసిన బోర్డుకు సంబంధించిన పాత వివరాలే ఉన్నాయి. బోర్డు కేవలం కాగితాల పైనే ఉందని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతోనే ఐవీఎఫ్ కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా వాటిపై సరైన విచారణ జరగడం లేదని తెలుస్తున్నది. ఏఆర్టీ చట్టం- 2021 ప్రకారం ప్రతి ఫెర్టిలిటీ సెంటర్, ఏఆర్టీ బ్యాంక్ తప్పనిసరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పద్ద రిజిస్టర్ అయి ఉండాలి. నిర్దిష్టమైన మౌలిక వసతులు, అర్హత కలిగిన వైద్య నిపుణులు ఉండాలి. అయితే చాలా చోట్ల ఈ నిబం దసలు గాలికొదిలేస్తున్నారు. ఏఆర్జీ చట్టం దాతల (స్పెర్మ్/అండం) వినియోగంపై కఠిన నిబంధనలు పెట్టింది. దాతలు నిర్దిష్ట వయస్సులో ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. ఒక దాత నుంచి పరిమిత సంఖ్యలో మాత్రమే అండాలను సేకరించాలి. కానీ, కొన్ని కేంద్రాలు దాతలకు సరైన పరీక్షలు చేయకుం దానే స్పెర్మ్ అండాలు ఉపయోగించడం. లేదా ఒకే దాత నుంచి అధిక సంఖ్యలో వాటిని సేకరించి, అనేక మందికి వినియోగించి సొమ్ము చేసుకుంటున్నాయి.

Advertisment
తాజా కథనాలు