Mouth Tips: నోరు పొడిబారుతుందా..? కారణం అయితే ఇదే.. మరి ఉపశమనం ఎలానో తెలుసా!!

గొంతు తరచుగా పొడిబారడం అనేది సర్వసాధారణం అయినప్పటికీ.. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అతి సాధారణ కారణం డీహైడ్రేషన్. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు లాలాజలం ఉత్పత్తి తగ్గి గొంతు పొడిబారుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
dry mouth

Dry Mouth

నేటి కాలంలో అనేక నోటి సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో నోరు ఎండిపోవడం ఒకటి. మీకు తరచుగా గొంతు పొడిగా అనిపిస్తుందా? లేదా రాత్రి నిద్రలో పలుమార్లు మేల్కొని దాహం వేస్తుందా? నోరు పొడిబారడం కేవలం దాహం వల్ల మాత్రమే కాదు.. దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. చాలామంది దీనిని సాధారణ సమస్యగా కొట్టిపారేస్తారు.. కానీ గొంతులో నిరంతర పొడిదనం అనేది డీహైడ్రేషన్ (Dehydration), లాలాజలం తక్కువగా ఉత్పత్తి కావడం లేదా అంతర్గత ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. మాట్లాడేవారు, తక్కువ నీరు తాగేవారు లేదా ఎక్కువ కెఫిన్ సేవించేవారిలో ఈ సమస్య సాధారణం. గాలిలో తేమ లేకపోవడం, ధూళి లేదా కాలుష్యం కూడా గొంతును పొడిబారుస్తాయి.  నోరు ఎండిపోవడానికి ఏ విటమిన్ లోపం కారణం..? తక్షణ ఉపశమనం కోసం ఏమి తాగాలో  కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

నోరు ఎండిపోవడానికి విటమిన్ లోపమా..?

గొంతు తరచుగా పొడిబారడానికి కారణాలు (Frequent Throat Dryness Causes): గొంతు తరచుగా పొడిబారడం అనేది సర్వసాధారణం అయినప్పటికీ.. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అతి సాధారణ కారణం డీహైడ్రేషన్. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు లాలాజలం ఉత్పత్తి తగ్గి గొంతు పొడిబారుతుంది. అదనంగా ఎక్కువ సమయం ఏసీ లేదా హీటెడ్ గదిలో ఉండటం, అధిక కెఫిన్ లేదా ఆల్కహాల్ సేవించడం కూడా గొంతు పొడిబారడానికి కారణం కావచ్చు. కొందరిలో సైనస్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు లేదా ధూమపానం కూడా దీనికి దారితీయవచ్చు. ఏ విటమిన్ లోపం గొంతు పొడిబారడానికి కారణం? తరచుగా గొంతు పొడిబారడం అనేది కేవలం హైడ్రేషన్‌తోనే కాకుండా.. కొన్ని విటమిన్లు, మినరల్స్ లోపంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. విటమిన్ ఎ (Vitamin A) లోపం వల్ల గొంతు, శ్లేష్మ పొరలు (mucus membranes) పొడిబారతాయి. విటమిన్ బి కాంప్లెక్స్ (Vitamin B complex) లోపం లాలాజల గ్రంథుల కార్యాచరణను తగ్గిస్తుంది. ఐరన్ (Iron), జింక్ (Zinc) లోపాలు కూడా గొంతులో చికాకు, పొడిదనానికి కారణమవుతాయి. - mouth-tips

 ఇది కూడా చదవండి: ఈ 5 వస్తువులను మీ పర్సులో పెట్టుకోండి.. ఇక మీకు డబ్బే డబ్బు!!

ఈ లోపాలను అధిగమించడానికి.. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, నట్స్, పుష్కలంగా నీటిని చేర్చుకోవాలి. నోరు పొడిబారినప్పుడు, నీరు తాగినా దాహం తీరనట్లు అనిపిస్తే.. రోజంతా ఒకటి లేదా రెండు కప్పుల కొబ్బరి నీళ్ళు తాగవచ్చు. కొబ్బరి నీరు ఒక సహజమైన, ఎలక్ట్రోలైట్-రిచ్ పానీయం, ఇది పొడి నోటి నుంచి ఉపశమనం అందిస్తుంది. పొడి నోరు అనేది దాహానికి సంకేతం మాత్రమే కాదు. ఇది శరీరంలో అంతర్గత మార్పులను కూడా సూచిస్తుంది. యాంటీహిస్టామైన్స్, రక్తపోటు మందులు లేదా యాంటిడిప్రెసెంట్స్ వంటి అనేక మందులు కూడా పొడి నోటికి కారణమవుతాయి. ధూమపానం చేసినా లేదా ఉపాధ్యాయులు, వక్తలు వంటి దీర్ఘకాలిక సంభాషణలు జరిపినా.. నిరంతరం మాట్లాడటం లాలాజలం ఉత్పత్తిని తగ్గించి.. నోరు పొడిబారడానికి దారితీస్తుంది. రాత్రి నిద్రించేటప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం కూడా ఒక ప్రధాన కారణం. ఇది గొంతులో తేమను తగ్గించి.. మేల్కొన్న తర్వాత పొడిదనానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ వ్యాధులు ఉంటే అస్సలు తినకూడదని తెలుసా..? మరి ఎవరికి ప్రయోజనమో తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు