Purse Vastu Tips: ఈ 5 వస్తువులను మీ పర్సులో పెట్టుకోండి.. ఇక మీకు డబ్బే డబ్బు!!

లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి.. పర్సు విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. పర్సులో సంపద నిలకడగా ఉండాలంటే.. ఈ ఐదు విషయాలను పాటించడం మంచిదని చెబుతున్నారు.

New Update
Purse Vastu Tips

Purse Vastu Tips

నేటి కాలంలో లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ చర్యలలో మనం వాడే పర్సులు ఒకటి. సాధారణంగా పర్సు అనేది బయటకు వెళ్లేటప్పుడు, డబ్బు నిల్వ చేయడానికి ఉపయోగిస్తాము. ఇది సంపదను నిల్వ చేయడానికి ముఖ్య ప్రదేశం. అందుకే పర్సును ఉపయోగించినప్పుడు కొంత జాగ్రత్త వహించాలని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. పర్సు అనేది కేవలం డబ్బు దాచుకునే స్థలం మాత్రమే కాదు.. ఇది శ్రేయస్సు, సంపదకు కేంద్రం కూడా. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి.. పర్సు విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా డబ్బు నిరంతరం ప్రవహించేలా చూసుకోవచ్చు. మీ పర్సులో సంపద నిలకడగా ఉండాలంటే.. ఈ ఐదు విషయాలను పాటించడం మంచిదని చెబుతున్నారు. సంపద సులభంగా రావడానికి వాటి గురించి కొన్ని విషయాలు  ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

పర్సులో పెట్టుకోవాల్సిన వస్తువులు:

కుటుంబ ఫోటో: వాస్తు ప్రకారం.. మీ పర్సులో కుటుంబ ఫోటో ఉంచుకోవడం శుభప్రదం. అయితే గురువులు, దేవతల చిత్రాలను ఉంచకూడదు. దీనికి బదులుగా, మీరు ఓం లేదా స్వస్తిక్ చిహ్నాలను ఎరుపు రంగులో రాసి ఉంచుకోవచ్చు. అయితే మీరు ఉంచే ఫోటో లేదా చిహ్నం చిరిగిపోకుండా లేదా మడత పడకుండా చూసుకోవాలి. లేదంటే ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి ఎదురయ్యే ప్రమాదం ఉంది.

డబ్బును చక్కగా పెట్టండి: పర్సులో డబ్బును ఎప్పుడూ మడతలు పెట్టకుండా.. చక్కగా ఉంచాలి. కరెన్సీ నోట్లను, నాణేలను వేరువేరుగా ఉంచడం మంచిది. డబ్బును సక్రమంగా నిర్వహించడం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి.

బంగారం లేదా ఇత్తడి ముక్క: ఒక చిన్న చదరపు బంగారం లేదా ఇత్తడి ముక్కను మీ పర్సులో ఉంచుకోవాలని వాస్తు చెబుతోంది. గురువారం నాడు దీనిని గంగాజలంతో కడిగి.. ప్రతి నెల శుద్ధి చేసుకోవడం వల్ల మీ పర్సులో శాశ్వత సంపద ఉండే అవకాశం ఉంది.

 ఇది కూడా చదవండి: ఈ 4 కారణాలతోనే భారత్‌లో 99% గుండెపోటు మరణాలు.. షాకింగ్ నిజాలు!!

కాగితాలు తగ్గించండి: పర్సు అనేది డబ్బు ఉంచే ప్రదేశం కాబట్టి.. అందులో తక్కువ కాగితాలు మాత్రమే ఉంచుకోవాలి. అనవసరమైన కాగితాలు ఎక్కువగా ఉంటే డబ్బు వృధా అవుతుందని.. అంతేకాకుండా పర్సు పోయే ప్రమాదం కూడా పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

 రాశి ప్రకారం వస్తువులు: రాశి చక్రం ప్రకారం.. కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకోవడం వల్ల ధనలాభం సులభమవుతుంది. మీ రాశికి సంబంధించిన చిహ్నం యొక్క చిన్న వస్తువును లేదా రాశికి అనుబంధంగా ఉన్న రంగు వస్తువును ఉంచుకోవచ్చు. ఇది సంపదను ఆకర్షించడంలో సహాయపడుతుంది.

పర్సుకు శుభప్రదమైన రంగు: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఆకుపచ్చ రంగు పర్సు అత్యంత శుభప్రదమైనదిగా చెబుతారు. ఈ రంగు బుధ గ్రహానికి సంబంధించినది. మీ జాతకంలో బుధుడు అనుకూలంగా ఉంటే.. ఆకుపచ్చ పర్సును ఉపయోగించడం వల్ల ధనలాభం పెరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఏమైనా సమస్యల నివారణకు సంబంధిత పండితులను సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: ఒంటరిగా పడుకుంటే దయ్యాలు రావు కానీ... ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి

Advertisment
తాజా కథనాలు