Walk Barefoot
Walk Barefoot: నడవడం ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం. ఇది కేవలం పాదాల వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మానసిక ఆరోగ్యాన్ని సమన్వయం చేస్తుంది. మన పాదాల కింద అనేక రకాల సున్నిత నరాల కేంద్రాలు ఉంటాయి. శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించి శక్తి ప్రసరణ జరుగుతుంది. ఉదయం సురక్షితమైన ప్రదేశంలో గడ్డిపై లేదా నేల మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాల కండరాలు బలపడతాయి. శరీరానికి స్థిరంగా నిలబడే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగవుతుంది. నడక వల్ల మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది.
కీళ్ల నొప్పులకు ఉపశమనం:
ముఖ్యంగా ప్రకృతితో సన్నిహితంగా ఉండడం వల్ల తాజా గాలి లభిస్తుంది. ఇది శరీరంలోని ఆక్సిజన్ మోతాదును పెంచుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం నేల సహజ విద్యుత్ శక్తి శరీరానికి తాకినప్పుడు శరీరంలోని మానసిక ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ వంటి ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని గ్రౌండింగ్ లేదా అర్తింగ్ అంటారు. ఇది నాడీ వ్యవస్థను స్థిరంగా ఉంచే ఒక ప్రక్రియ. అలాగే చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. మోచేయి, మోకాలు వంటి భాగాల్లో ఎనర్జీ పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: కరివేపాకును తీసి పడేయకండి..దాని టీతో ఎన్నో లాభాలు
చెప్పులు లేకుండా నడవడం వల్ల నేలతో నేరుగా మ సంబంధం కలిగి ఉంటారు. ఇది సహజంగా శరీరానికి విశ్రాంతి కలిగిస్తుంది. అయితే మురికి ప్రదేశాల్లో నడవడం ప్రమాదకరం కావచ్చు. కాబట్టి శుభ్రమైన, మృదువైన నేలపై మాత్రమే చెప్పులు లేకుండా నడవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చెప్పులు లేకుండా ఉదయం కొన్ని నిమిషాలు నడిస్తే శారీరక ధృడత్వం, మానసిక స్థిరత్వం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ప్రాణాయామంతో వేసవిలో ఎదురయ్యే సమస్యలకు చెక్
( daily-walk | walking-barefoot | walking-with-barefoot | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)