Pranayama: ప్రాణాయామంతో వేసవిలో ఎదురయ్యే సమస్యలకు చెక్‌

వేడి కారణంగా చిరాకు రావడం, కోపం పెరగడం, మానసిక స్థిరత్వం కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో అనులోమ, విలోమం, చంద్ర భేడి వంటి ప్రాణాయామాలు మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

New Update

Pranayama: వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతలు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అధిక వేడి కారణంగా శరీరంలో నీరు కోల్పోవడం, అలసట, చిరాకు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇవి కేవలం శారీరకంగా కాకుండా మానసికంగా కూడా మన జీవనశైలిని దెబ్బతీస్తాయి. వేసవికాలంలో శరీరాన్ని చల్లబరచడం, మానసికంగా ప్రశాంతంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. దీనికి సహజమైన మార్గం ప్రాణాయామం. ఇది యోగాలో ఒక భాగం. అయితే శ్వాస నియంత్రణపై ఆధారపడి ఉంటుంది. సరైన రీతిలో, క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల వేసవిలో ఎదురయ్యే సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా శీతలి, శిత్కారి వంటి శ్వాస వ్యాయామాలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనం కలిగిస్తాయి. నాలుక బయట పెట్టి గాలి పీల్చి, ముక్కు ద్వారా వదలాలి.  ఈ విధానం ద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గి మనకు హాయిగా అనిపిస్తుంది.

శరీరంలోని జీవశక్తి..

వేసవి కాలంలో మానసికంగా కూడా ఒత్తిడికి గురవ్వడం సాధారణం. వేడి కారణంగా చిరాకు రావడం, కోపం పెరగడం, మానసిక స్థిరత్వం కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో అనులోమ, విలోమం, చంద్ర భేడి వంటి ప్రాణాయామాలు మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి మనలోని ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించి మన శాంతిని కలిగిస్తాయి. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలోని జీవశక్తి పెరుగుతుంది. వేసవిలో తరచూ నీరసంగా అనిపించడాన్ని నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. ఉదయాన్నే లేదా సాయంత్రం చల్లని వాతావరణంలో ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలోని అలసటను తగ్గించవచ్చు.

ఇది కూడా చదవండి: వేసవిలో ఈ మసాలా దినుసుల జోలికి అస్సలు వెళ్లకండి

అంతేకాకుండా వేసవిలో శ్వాసకోశ సమస్యలు పెరగవచ్చు. వేడి, చెమట, నీటి లోపం వలన ఊపిరితిత్తులు బలహీనపడతాయి. ఈ సమయంలో ప్రాణాయామం ద్వారా శ్వాసకోశ వ్యవస్థ బలపడుతుంది. శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ మెరుగవుతుంది. శ్వాస, గుండె వేగం సరిగ్గా ఉంటాయి. క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల మన శాంతి పెరగడమే కాకుండా కోపాన్ని తగ్గించుకోవచ్చు. వేడి వాతావరణంలో మన ప్రవర్తన మారిపోవచ్చు, కానీ నియంత్రిత శ్వాస పద్ధతుల ద్వారా మన మానసిక స్థితిని సమతుల్యం చేయవచ్చు. మొత్తానికి వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రాణాయామం అత్యంత ఉపయోగకరమైన సాధనంగా ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని, మనస్సుకు శాంతిని కలిగిస్తూ శక్తిని పెంచే మార్గంగా నిలుస్తుంది. క్రమం తప్పకుండా దీన్ని జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండడం ఎంతో సులభమని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: రోజూ లీటర్‌ పాలు తాగితే ప్రమాదమా..నిపుణులు ఏం చెబుతున్నారు?

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | yoga | best-yoga | benefits-yoga | latest-news )

Advertisment
Advertisment
తాజా కథనాలు