పైశాచికత్వం...తలపై బాది.. మూత్రం పోసి.. మరో అమానవీయ ఘటన...!!
నేటి సమాజం ఎటు పయనిస్తుందో..గమ్యమెటో తెలియని పరిస్ధితి దాపురించింది. ఆధునిక కాలంలోనూ ఆటకవికంగా ప్రవర్తిస్తూ..మనషులనే విషయాన్ని మరిచిపోతున్నారు. అమాయక ప్రజలపై పలు చోట్ల ఇటీవల జరుగుతోన్న వరస దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న మధ్యప్రదేశ్ లో గిరిజనుడిపై మూత్రంపోసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు ఏపీలోనూ ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఆగ్రాలో అలాంటి ఘటనే మరోకటి జరిగింది. ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి..రక్తం కారుతుండా పైశాచికత్వంతో బాధితుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.