/rtv/media/media_files/2025/05/15/Df2S5Ef3HeQtTKwfK6yi.jpg)
Head Massage
Head Massage: తల మసాజ్ అనేది సంప్రదాయ ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం. ఇది జుట్టు పెరుగుదల నుంచి ఒత్తిడి తగ్గింపుకు వరకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పెద్దలు తల మసాజ్‌ను ఒక సాధారణ నిత్యక్రియగా చేసుకొంటూ వచ్చారు. దీనివల్ల కలిగే మానసిక, శారీరక ప్రయోజనాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. తల మసాజ్ చేయడం వల్ల మెదడులో హార్మోన్ల విడుదల పెరుగుతుంది. ముఖ్యంగా సెరోటోనిన్, డోపమైన్ అనే హార్మోన్లు మనస్సును ప్రశాంతంగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ ప్రక్రియ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
శరీరాన్ని సేదతీసే లక్షణాలు:
ఈ రోజుల్లో జుట్టు సమస్యలు, జుట్టు రాలడం, పెరుగుదల మందగించడమనే సమస్యలు ప్రతి ఒక్కరికీ కనిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యలను తగ్గించడంలో తల మసాజ్ అనేది ఒక సహజమైన మార్గంగా పనిచేస్తుంది. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరి జుట్టు మూలాలను బలపరుస్తుంది. తద్వారా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. తల మసాజ్ నిద్రలేమి సమస్యను ప్రభావవంతంగా నియంత్రించగలదు. మసాజ్ సమయంలో శరీరం ఎండార్ఫిన్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. శరీరాన్ని సేదతీసే లక్షణాలు వలన విశ్రాంతి కలిగి గాఢ నిద్రలోకి వెళ్లే అవకాశం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: ఈ ముల్లు మొక్కలో అనేక ఔషధ గుణాలు తెలుసా..?
తల మసాజ్ వల్ల మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులను కూడా తగ్గించవచ్చు. ఇది కండరాల ఉద్రిక్తతను తగ్గించడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరచడం, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. తల మసాజ్ సమయంలో ఉపయోగించే ఆయిల్ వల్ల తల చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంచుతోంది. దీనిని క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే చర్మపు మృత కణాలు, అదనపు సెబమ్ తొలగింపవుతాయి. ఇది స్కాల్ప్‌ను శుభ్రంగా, చుండ్రు సమస్య, శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఒక సులభమైన, సహజమైన ఆరోగ్య పద్ధతి కావడంతో ప్రతి ఒక్కరూ దీనిని జీవితంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సహజంగా జీవక్రియను మెరుగుపర్చే రహస్య శక్తి
( head-massage | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)