Chutney: పసుపుతో ఇలా చట్నీ చేశారంటే జలుబు, ఫ్లూ పరార్‌

పసుపుతో చట్నీ లాభాలను పొందవచ్చు. ఈ చట్నీ తయారీలో పచ్చి పసుపు కొమ్ములు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, నల్లజీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వాడాలి. ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్, రోటిలో దంచుకోవచ్చు. దీన్ని అన్నం లేదా రొట్టెతో తినవచ్చు.

New Update
Chutney

Chutney

Chutney: పసుపు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఒక ప్రాచీన ఔషధ మూలిక. భారతీయ సంప్రదాయంలో ఇది వైద్యంలో, వంటల్లో, పూజలలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది. పసుపులో ముఖ్యంగా ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలతో అనేక రకాల రోగాల నుండి రక్షణ కలిగిస్తుంది. పసుపును సాధారణంగా వంటల్లో వాడతారు కానీ కొంతమందికి దాన్ని పాలలో కలిపి తాగడం ఇష్టం ఉండకపోవచ్చు. 

Also Read :  ఈ పాత్రలో పసుపు నీరు తాగితే.. బోలెడన్నీ ప్రయోజనాలు

పసుపుతో చట్నీ తయారీ కోసం..

అలాంటి వారు పసుపుతో చట్నీ తయారు చేసుకుని తీసుకుంటే అదే లాభాలను పొందవచ్చు. ఈ చట్నీ తయారీలో పచ్చి పసుపు కొమ్ములు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, నల్ల జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వాడాలి. మొదట ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి లేదా రోటిలో దంచుకోవచ్చు. తర్వాత పాన్‌లో నూనె వేడిచేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అందులో వేసి మీడియం ఫ్లేమ్‌లో కొంతసేపు ఉంచాలి. నీరు ఆవిరై పొడిగా మారిన తరువాత చట్నీ రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా రొట్టెతో తినవచ్చు. 

ఇది కూడా చదవండి: టాబ్లెట్‌ వేసుకున్నా జ్వరం తగ్గకపోతే ఈ టెస్టులు చేయించుకోండి

వేడిగా ఉన్నపుడే రుచి ఎక్కువగా ఉంటుంది. ఈ చట్నీని ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని వాపులు తగ్గుతాయి. జలుబు, ఫ్లూ, ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. చలికాలంలో తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. పసుపులో ఉండే ఫంగల్, బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాల వలన ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇది సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. అందువల్ల ఈ చట్నీని ఆహారంలో భాగంగా చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Also Read :  ఉదయం పరగడుపున వీటిని తింటే ఎంతో ఆరోగ్యం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ ఆహారాలు తింటే వీర్యం బాగా వృద్ధి చెందుతుంది

( chutneys | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
తాజా కథనాలు