/rtv/media/media_files/2025/05/03/XdxXzCFwRAfyHzmcRI5q.jpg)
Papaya and banana
Health Tips: నేటి కాలంలో చాలామంది ఉదయం లేచిన వెంటనే బెడ్ టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా చేసుకుంటారు. ఇవి లేకుండా రోజు ప్రారంభించలేని స్థితిలో ఉంటారు. కానీ ఈ అలవాటు శరీరానికి తాత్కాలిక తృప్తిని ఇచ్చినా దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి మంచిది కాదు. దీంతోపాటు శరీరానికి సరైన పోషణ అందదు. అందుకే ఇలా బెడ్ టీకి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శక్తి, పోషణ రెండు ఒకేసారి లభిస్తాయి. ఇది రోజంతా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది.
శరీరంలో వ్యాధులపై పోరాడే శక్తి..
పరగడుపునే తినే ఆరోగ్యకరమైన ఆహారాల్లో ముందుగా చెప్పుకోదగినది బాదంపప్పు. ఇవి ముందురోజే నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి తినాలి. బాదంపప్పులో విటమిన్ E, మెగ్నీషియం, హెల్తీ కొవ్వులు ఉండటంతో శరీరానికి శక్తి, రోగ నిరోధక శక్తి లభిస్తుంది. సూక్ష్మ క్రిములను నాశనం చేస్తూ వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే శరీరానికి పుష్కలమైన పోషణను అందిస్తుంది. ఇక బొప్పాయిపండు కూడా ఉదయాన్నే తినదగ్గ అద్భుతమైన ఆహారం. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఇది రక్త సరిగ్గా ప్రసరించేందుకు సహాయపడుతుంది. ఫలితంగా శరీరంలో వ్యాధులపై పోరాడే శక్తి పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: 40 ఏళ్ల వయస్సు తర్వాత కచ్చితంగా ఈ పండ్లను తినాలి
అలాగే అరటిపండ్లు కూడా ఉదయాన్నే తినడానికి ఎంతో మంచివి. ఇవి శక్తిని అందించి రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి. ముఖ్యంగా వ్యాయామం చేసే వారికి ఇవి మంచి ఎనర్జీ సోర్స్. నల్ల ద్రాక్ష కిస్మిస్ కూడా పరగడుపున తినడం వల్ల ఐరన్, మెగ్నీషియం, పొటాషియం లభిస్తాయి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరానికి తగిన శక్తిని అందిస్తూ మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధకం తగ్గుతుంది. ఈ విధంగా ఉదయం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి తగిన శక్తి, పోషణ లభిస్తుంది. ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వేసవిలో పిల్లల చర్మపై దద్దుర్లు ఎందుకు వస్తాయి..పరిష్కారం ఏంటి?
( tea | coffee | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )