/rtv/media/media_files/2025/04/30/BI0m7vbThxrSt7ZwceQK.jpg)
tablets
Health Tips: వేసవిలో తరచుగా జ్వరం రావడం ఆరోగ్యానికి మంచిది కాదు. శీతాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనితో అనారోగ్యాలు సాధారణం అవుతాయి. అయితే వేసవిలో కూడా జ్వరం రావడం పెద్ద సమస్య. వేసవిలో జ్వరాలు ఎక్కువగా రావడం అంటే అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రధాన వ్యాధుల సంకేతం కావొచ్చు. వ్యాధుల రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: వేసవిలో గుండె జబ్బులు ఉన్నవారు ఇవి గుర్తుంచుకోవాలి
జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు:
వేడి వాతావరణంలో అవగాహన లేకుండా కలుషితమైన నీరు, పండ్ల జ్యూస్ తాగితే అది ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్‌తో పోరాడుతున్నప్పుడు జ్వరం వస్తుంది. కానీ జ్వరం కేవలం కొన్ని గంటలపాటు లేదా ఒక రోజు ఉంటే అది సాధారణం. కానీ 2-3 రోజులు కొనసాగితే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆ వ్యాధులు ఉన్న వారు చెరుకు రసం అస్సలు తాగొద్దు.. షాకింగ్ విషయాలు!
ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాల పరీక్షలు చేయించుకోవడం అవసరం. జ్వరం ఉంటే సంప్రదించి కాలేయం, మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవాలి. మందులు తీసుకున్న తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే వైద్య సలహా తప్పనిసరి. జ్వరాలు ఆరోగ్యానికి పెద్ద ప్రమాదంగా మారక ముందు పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ప్రాథమిక పరీక్షలు చేయించడం ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ముఖ్యమని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: రాత్రిపూట కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే ఇలా చేయండి
( health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )