Health Tips: ఈ ఆహారాలు తింటే వీర్యం బాగా వృద్ధి చెందుతుంది

అర్జున చెట్టు బెరడు గుండె జబ్బులు, ఆస్తమా, ఎముకల సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అర్జున బెరడు పాలతో కలిపి తీసుకుంటే పురుషులలో వీర్య ఉత్పత్తిని పెంచి సంతాన ప్రాప్తికి, శృంగార సామర్థ్యం పెరిగి, శృంగారంలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు.

New Update

Health Tips: అర్జున చెట్టు బెరడుకు ఆయుర్వేదంలో విశిష్ట స్థానం ఉంది. ఇది ప్రధానంగా గుండె సంబంధిత సమస్యల నివారణకు వాడతారు. ఈ చెట్టు తెలుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తుంది. దీని బెరడులో ఉన్న ఔషధ గుణాల వల్ల గుండె జబ్బులు, ఆస్తమా, ఎముకల సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అర్జున చెట్టు బెరడును పాలలో మరిగించి తాగడం వల్ల గుండె జబ్బులు రాకుండా నిరోధించవచ్చు. ఇది రక్తప్రసరణను మెరుగుపరచి కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి కలిగివుంటుంది. ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. ఆస్తమా, జలుబు వంటి శ్వాస సంబంధిత సమస్యలున్నవారు అర్జున బెరడు చూర్ణాన్ని పాయసంతో కలిపి తీసుకోవచ్చు. 

శక్తివంతమైన సహజ ఔషధం:

ముఖ్యంగా చలికాలంలో ఇవి మరింత ప్రాధాన్యం కలిగి ఉంటాయి. పాలలో కలిపి రాత్రి పూట తాగడం వల్ల శ్వాస సంబంధ సమస్యలతో పాటు చలికాలం వల్ల వచ్చే అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకలకు బలాన్ని అందిస్తుంది. శక్తివంతమైన సహజ ఔషధంగా పనిచేస్తుంది. చర్మ సంబంధిత సమస్యల విషయంలో కూడా అర్జున బెరడు ఎంతో మేలు చేస్తుంది. దీనిని తేనెతో కలిపి మొటిమలపై రాస్తే అవి త్వరగా తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమల మచ్చలు తగ్గి ముఖం యవ్వనంగా, మృదువుగా కనిపిస్తుంది. అలాగే దీని కషాయం తాగడం వల్ల శరీరంలోని పుండ్లు, కాలిన గాయాలు త్వరగా మానిపోతాయి. 

ఇది కూడా చదవండి: ఐస్‌క్రీమ్‌ల్లో డిటర్జెంట్లు.. జాగ్రత్త అంటున్న అధికారులు

ఇది శరీరంలో ఇన్ఫెక్షన్‌కి అడ్డుగా నిలుస్తుంది. అర్జున బెరడు పురుషులలో కూడా పలు రకాల లాభాలను ఇస్తుంది. పాలతో కలిపి తీసుకుంటే వీర్య ఉత్పత్తిని పెంచుతుంది. సంతాన ప్రాప్తికి సహకరిస్తుంది. శృంగార సామర్థ్యం పెరిగి, శృంగారంలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. వీర్య కణాల నాణ్యత మెరుగవుతుంది. అంతేగాకుండా దీనిని నూరి గంధంలా తీసి గాయాలపైనా ఉపయోగించవచ్చు. గడ్డలు, పుండ్లు, కాలిన గాయాలపై రాసితే అవి త్వరగా తగ్గుతాయి. ఈ విధంగా అర్జున చెట్టు బెరడును వాడితే ఎన్నో రకాల లాభాలు పొందవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది ఒక సహజ ఆయుధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కరివేపాకును తీసి పడేయకండి..దాని టీతో ఎన్నో లాభాలు

( terminalia-arjuna | male | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు