/rtv/media/media_files/2025/07/28/fasting-2025-07-28-06-54-12.jpg)
Fasting
హిందూ మతంలో ఉపవాసం అనేది అత్యంత పవిత్రమైన ఆచారం. ఇది కేవలం శారీరకంగా ఆహారాన్ని త్యజించడమే కాదు.. మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా శుద్ధతను పొందే మార్గంగా చెబుతారు. ఉపవాసానికి హిందూ మత గ్రంథాల్లో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇది మనస్సును ప్రశాంతపరచడం, ఇంద్రియాలను నియంత్రించడం, భగవంతుని పట్ల భక్తిని పెంపొందించడం వంటి వాటికి దోహదపడుతుంది. ఉపవాసం పాటించడం ద్వారా మనలో త్యాగభావం, ధైర్యం, సహనం వంటి విలువలు పెరుగుతాయి. అసలు ఉపవాసం అంటే ఏంటో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Also Read : ఎంతకు తెగించార్రా.. బిడ్డను కొనుక్కొచ్చి నాటకం - ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్' కేసులో సంచలన నిజాలు..
ప్రతీ కర్మ భగవంతునికి అంకితం కావాలి..
హిందూమతానికే పరిమితమైన ఆచారం కాదు ఉపవాసం. ఇస్లాం, బౌద్ధం, క్రైస్తవం వంటి ఇతర మతాల్లో కూడా దీన్ని ఆధ్యాత్మిక నియమంగా పాటిస్తున్నారు. అయితే ఉపవాసం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఆకలితో, దాహంతో ఉండటం లేదా మౌనంగా గడిపేయడమే కాదు. ఉపవాసం అంటే ‘ఉప’ అంటే దగ్గరగా, ‘వాసం’ అంటే నివాసం. అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం. ఆ రోజు మన మనస్సు, బుద్ధి, హృదయం దేవునిపై కేంద్రీకరించాలి. ఇదే ఉపవాసం యొక్క అసలు భావనని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: నిద్రపోతున్నప్పుడు ఎందుకు చనిపోతారో తెలుసా..? ఈ కారణం వల్లనే
ఉపవాసం రోజున మనం చేసే ప్రతీ కర్మ భగవంతునికి అంకితం కావాలి. ఉదాహరణకు.. నైవేద్యంగా సమర్పించే వస్తువులు కూడా ఆయా దేవతలకి ఇష్టమైనవి కావాలి. శ్రీకృష్ణునికి తులసి, శివుడికి బెల్పత్ర, గణేశుడికి దూర్వా, ఇతర దేవతలకు లవంగాలు సమర్పించడం మానసిక సమర్పణకు సంకేతాలు. ఈ కర్మలకు మంత్రోచ్చారణ జత కలిస్తే అది మరింత పవిత్రతను ఇస్తుంది. మనం ప్రీతిపాత్రంగా భావించే దేవతా మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ మంత్ర శక్తిని మనలో నింపుకోవాలి. ఆ తర్వాత సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా భగవంతుని కృపకు పాత్రులమవుతాం. ఇది ఉపవాసానికి ఉన్న అంతరార్థం. ఉపవాసం అనేది మన ఆలోచనలు, భావోద్వేగాలు, ఇంద్రియాలను నియంత్రించుకునే సాధన. ఇది శారీరకంగా శుద్ధతనిచ్చే ఉపకరణం మాత్రమే కాదు.. ఆత్మను, మనస్సును దేవుని వైపు మళ్లించే ఆధ్యాత్మిక సాధన. అలాంటి ఉపవాసం పాటించగలగటం ద్వారా మన జీవితం ధ్యానమయం, శాంతిమయం, భక్తిమయం అవుతుందని పండితులు చెబుతున్నారు.
Also Read : ఫ్లైట్‌లో ప్రయాణీకుడు హల్‌చల్.. ‘ట్రంప్ చావు.. బాంబుతో పేల్చేస్తా’
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: ప్రతిరోజూ మాంసం తింటున్నారా..? నాన్-వెజ్ ప్రియులు ఆరోగ్యంపై జాగ్రత్త
(fasting | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style)