/rtv/media/media_files/2025/07/28/srishti-test-tube-baby-center-case-sensational-facts-2025-07-28-08-41-04.jpg)
Srishti Test Tube Baby Center Case Sensational facts
హైదరాబాద్‌లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ (Srishti Test Tube Baby Center) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసీ ముసుగులో అక్రమంగా బిడ్డను కొనుగోలు చేసి, సంతానం లేని దంపతులకు విక్రయించినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ కేసులో కీలక పాత్రధారులైన డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు అడ్వకేట్ జయంత్ కృష్ణతో సహా 8మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
Srishti Test Tube Baby Center
రాజస్తాన్‌కు చెందిన దంపతులు గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్‌లో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో గత ఏడాది ఆగస్టులో సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. దీంతో ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనే ఛాన్స్ లేదని.. అందువల్ల సరోగసి (అద్దె గర్భం) ద్వారా పిల్లలను కనవచ్చని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్డాక్టర్ నమ్రత తెలిపారు.
ఇది కూడా చూడండి: పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన
దీంతో డాక్టర్ నమ్రత మాటలు విన్న ఆ దంపతులు దానికి ఓకే చెప్పారు. దీనికోసం క్లినిక్ నిర్వాహకులు ఆ దంపతుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశారు. అనంతరం దంపతులు విజయవాడకు వెళ్లి అక్కడ శాంపిల్స్ ఇచ్చారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత సరోగసి కోసం గర్భం మోసే మహిళ దొరికిందని క్లినిక్ వారు దంపతులను నమ్మించారు.
ఇందులో భాగంగానే ఈ ఏడాది జూన్‌లో గర్భం మోసిన మహిళ వైజాగ్‌లో డెలివరీ అయిందని ఆ దంపతులకు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వారు ఫోన్ చేసి చెప్పారు. మగబిడ్డ జన్మించాడని.. సీ సెక్షన్ అయినందున మరో రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి తీసుకున్నారు. అనంతరం వారు వైజాగ్ వెళ్లి బాబును తీసుకున్నారు. అయితే బిడ్డ తమ పోలికలతో లేకపోవడంతో వారికి కాస్త అనుమానం కలిగింది.
ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
అనంతరం ఆ బిడ్డకు సంబంధించి డీఎన్‌ఏ టెస్ట్‌ల గురించి క్లినిక్ వారిని ఎన్ని సార్లు అడిగినా వారు దాటవేశారు. ఇలా కాదని.. నేరుగా వెళ్లి క్లినిక్ ఓనర్, డాక్టర్ నమ్రతను నిలదీశారు. దీంతో ఆమె ఉగ్రరూపం బయటపడింది. ప్రశ్నించిన దంపతులనే ఆమె బెదిరించింది. అదే క్లినిక్ బిల్డింగ్‌లో డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ అడ్వకేట్‌గా ప్రాక్టిస్ చేస్తూ, క్లినిక్ మేనేజర్‌గా ఉన్నాడు. అతడు కూడా ఆ దంపతులను బెదిరించాడు. అనవసరమైన కేసుల్లో ఇరుక్కుంటారని భయపెట్టాడు.
దీంతో వారు చేసేదేమి లేక.. సొంత ఖర్చులతో ఢిల్లీలో డీఎన్‌ఏ టెస్ట్‌లు చేయించుకున్నారు. అక్కడ వచ్చిన రిపోర్టు చూసి ఆ దంపతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తండ్రి డీఎన్‌ఏతో బాబు డీఎన్‌ఏ మ్యాచ్ కాకపోవడంతో ఆశ్చర్యపోయారు. అనంతరం దంపతులు పలుమార్లు క్లినిక్ వెళ్లారు. కానీ అక్కడ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నేరుగా గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గత రెండు వారాలుగా దర్యాప్తు చేసి పలు కీలక అంశాలను వెల్లడించారు.
పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజానికి భర్త వీర్యంతో సరోగసీ జరగలేదని పోలీసులు గుర్తించారు. అది మాత్రమే కాకుండా అసలు సరోగసీయే చేయలేదని సంచలన విషయాలు బయటపెట్టారు. హైదరాబాద్‌లో ఓ ఏజెంట్ నుంచి పేద దంపతులను ఒప్పించారని.. వారికి రూ.90 వేలు ఇచ్చి పుట్టబోయే బిడ్డను కొనుగోలు చేశారని తెలిపారు. సరిగ్గా డెలివరీ సమయంలో పేదింటి దంపతులను విమానంలో హైదరాబాద్ నుంచి వైజాగ్ తరలించారని పేర్కొన్నారు. అనంతరం వైజాగ్‌లో డెలివరీ అయిన తర్వాత.. సరోగసికి ఒప్పుకున్న రాజస్తాన్ దంపతులకు ఫోన్ చేసి.. మీ బాబే అంటూ నమ్మించారని పోలీసులు తెలిపారు.
అనంతరం ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వహకురాలు డాక్టర్నమ్రత (64), ఆమె కుమారుడు, క్లినిక్ మేనేజర్ జయంత్ కృష్ణ(25), సృష్టి వైజాగ్బ్రాంచీ మేనేజర్ కళ్యాణి (40), ఎంబ్రలాజిస్ట్ చెన్నారావు(37), ల్యాబ్ టెక్నిషియన్, గాంధీ హాస్పిటల్ అనిస్థిషీయా అసిస్టెంట్ ప్రొఫెసర్నర్గుల సదానందం(41), అస్సాంకు చెందిన ముగ్గురు సిబ్బంది ఉన్నారు.
secunderabad test tube baby center | test tube baby center in hyderabad