Thyroid
Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. వీటి ప్రభావం ఆరోగ్యంతో పాటు, వారి జీవనశైలి, హార్మోన్ల సమతుల్యత, మానసిక స్థితిపై తీవ్రంగా పడుతుంది. థైరాయిడ్ వ్యాధి వల్ల బరువు పెరగడం, ఆకస్మిక అలసట, మలబద్ధకం, జీర్ణ సమస్యలు, నిద్రలేమి, నెలసరి రుతు చక్రంలో మార్పులు వంటి అనేక లక్షణాలు ఉద్భవిస్తాయి. ఇవి క్రమంగా తీవ్రమై, శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపగలవు. థైరాయిడ్ సమస్యలకు ప్రధానంగా హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం అనే రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ హార్మోన్లు గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి ద్వారా ఉత్పత్తి అవుతాయి.
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ:
ఈ గ్రంథి శరీరంలోని మెటబాలిజం, ఉష్ణ ఉత్పత్తి, శక్తి వినియోగం వంటి వ్యవస్థలను నియంత్రిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ల స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడితే అది థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా రావచ్చు. గర్భిణీల్లో ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాతా శిశువుల ఆరోగ్యంపై దుష్పరిణామాలు కలగవచ్చు. థైరాయిడ్ బాధితులు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అధిక కాఫీ, టీ, చక్కెర పదార్థాలు, పాల ఉత్పత్తులు వంటి వాటిని తగ్గించాలి. పచ్చి కూరగాయలు, ఐయోడిన్ కలిగిన ఆహారాలు ఉప్పు, సముద్ర ఆహారాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారాలు ఉపయోగపడతాయి.
ఇది కూడా చదవండి: వేసవిలో పగిలిన మడమలకు చక్కటి పరిష్కారం
రోజూ 30 నిమిషాల వరకు వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల హార్మోన్ల స్థాయిలను సమతుల్యం చేయవచ్చు. దీనితో పాటు నిత్యం సరైన సమయంలో నిద్రపోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం కూడా థైరాయిడ్ నియంత్రణకు సహాయపడతాయి. ప్రతి 6 నెలలకు థైరాయిడ్ హార్మోన్ల స్థాయి పరీక్ష చేయించుకోవడం, వైద్యుడి సూచనల మేరకు మందులు వాడటం చాలా అవసరం. మొత్తానికి.. థైరాయిడ్ ఒక జీవితాంతం కనిపించే సమస్యగా భావించాల్సిన అవసరం లేదు. సరైన ఆహారం, జీవనశైలి మార్పులు, వైద్య పర్యవేక్షణతో దీనిని సమర్థంగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి
( hypothyroidism | thyroid-problem | latest-news | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips)