Cockroach Tips: ఈ ఒక్క ఆకును మీ కిచెన్‌లో ఉంచితే చాలు.. బొద్దింకలు పరుగో పరుగు!

బొద్దింకల సమస్యను బట్టి బే లీఫ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఎండిన బే లీఫ్‌ ఆకులను కిచెన్‌లో సింక్ కింద, అల్మారాల్లో, స్టోర్ రూమ్‌లలో, బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచాలి. బే లీఫ్‌లను పొడి చేసి బొద్దింకలు ఉన్న చోట్ల ఈ పొడిని చల్లితే సమస్య తగ్గుతుంది.

New Update
Bay leaf and Cockroach

Bay leaf and Cockroach

వర్షాకాలం(Rainy Season) వచ్చిందంటే చాలా ఇళ్లలో బొద్దింకల సమస్య సర్వసాధారణం. వంటగది, బాత్రూమ్ వంటి చోట్ల ఈ చిన్న పురుగులు అపరిశుభ్రతను వ్యాప్తి చేయడమే కాకుండా అనేక రకాల వ్యాధులకు కూడా కారణమవుతాయి. ఈ సమస్యను నివారించడానికి చాలామంది రసాయనాలతో కూడిన స్ప్రేలు, పౌడర్లను ఉపయోగిస్తుంటారు. కానీ వాటి ప్రభావం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు బొద్దింకల సమస్యకు సురక్షితమైన, సహజమైన మరియు సులభమైన గృహ చిట్కా అందుబాటులో ఉన్నాయి. అదే ప్రతి ఇంట్లో సుగంధ ద్రవ్యంగా ఉండే బిర్యానీ ఆకు. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

బే లీఫ్ అద్భుతమైన పరిష్కారం:

బే లీఫ్‌లో బొద్దింకలు(cockroaches) ఏ మాత్రం తట్టుకోలేని ఒక బలమైన సహజ సువాసన ఉంటుంది. దీనిలో ఉండే ప్రత్యేకమైన నూనెలు, సుగంధ పదార్థాల కారణంగా బొద్దింకలు ఈ ఆకు ఉన్న ప్రదేశాల నుంచి వెంటనే పారిపోతాయి.ఈ సువాసన బొద్దింకలను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా.. ఇది రసాయనాలకు భిన్నంగా పూర్తిగా సహజమైనది కాబట్టి చిన్నపిల్లలు, పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. బొద్దింకల సమస్యను బట్టి బే లీఫ్‌ను మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎండిన బే లీఫ్‌ ఆకులను కిచెన్‌లో సింక్ కింద, అల్మారాల్లో, స్టోర్ రూమ్‌లలో, బొద్దింకలు ఎక్కువగా తిరిగే ఇతర ప్రదేశాల్లో ఉంచాలి, ఎండిన బే లీఫ్‌లను పొడిగా చేసి బొద్దింకలు బయటకు వచ్చే చోట్ల ఈ పొడిని చల్లాలి. ఇది మరింత వేగంగా పనిచేస్తుంది, బే లీఫ్‌లను నీటిలో మరిగించి ఆ నీరు చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి మూలల్లో పిచికారీ చేయాలి. దీనివల్ల బొద్దింకలు పారిపోవడమే కాకుండా ఇల్లు కూడా సువాసనతో నిండిపోతుంది.

ఇది కూడా చదవండి: స్త్రీ అండాలను ఫ్రీజ్ చేయడానికి సరైన వయసు ఏదో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి

బే లీఫ్‌(Bay Leaf) ను ఉపయోగించిన వెంటనే దాని ప్రభావం మొదలవుతుంది. బొద్దింకలు ఆ వాసనను పసిగట్టగానే ఆ ప్రదేశం నుంచి దూరంగా పారిపోతాయి. కొన్ని వారాల పాటు ఈ చిట్కాను నిరంతరంగా పాటిస్తే బొద్దింకల బెడద పూర్తిగా తగ్గిపోతుంది. బే లీఫ్ కేవలం బొద్దింకలను మాత్రమే కాదు చీమలు, ఇతర చిన్న కీటకాలను కూడా ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. దీని సువాసన ఇంటి వాతావరణాన్ని కూడా ఆహ్లాదంగా మారుస్తుంది. బే లీఫ్‌ల సువాసన కాలక్రమేణా తగ్గుతుంది. కాబట్టి వాటిని అప్పుడప్పుడు మార్చడం మంచిది. బొద్దింకల సమస్య ఎక్కువగా ఉంటే పొడి రూపంలో ఉపయోగించడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. బే లీఫ్‌లను తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచడం వల్ల వాటి ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. రసాయన స్ప్రేల కంటే సురక్షితమైన, చవకైన, సులభమైన పరిష్కారం కోసం చూస్తున్న వారికి బే లీఫ్ ఒక అద్భుతమైన మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు.  

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో టీ తాగితే డేంజర్.. ఎందుకో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు