/rtv/media/media_files/2025/09/15/chocolate-heart-risk-2025-09-15-15-39-48.jpg)
Chocolate Heart Risk
డార్క్ చాక్లెట్ అనేది కోకో గింజల నుంచి తయారు చేస్తారు. ఇది ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో పంచదార తక్కువగా ఉంటుంది.. కోకో శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది దాని ప్రత్యేకమైన చేదు రుచికి, గొప్ప సువాసనకు ప్రసిద్ధి చెందింది. డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఇది ఒత్తిడిని తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మితంగా తింటే.. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే చాక్లెట్ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఈ తీపి పదార్థంపై చర్చ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. చాక్లెట్ మనసును ప్రశాంతం చేయడమే కాకుండా.. పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
అనేక అనారోగ్య సమస్యలు..
కానీ అతిగా తింటే మాత్రం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు అభిప్రాయం ప్రకారం.. తక్కువ మోతాదులో డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాల్స్ లభిస్తాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్రమం తప్పకుండా, పరిమితంగా చాక్లెట్ తినేవారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తెలుపుతున్నారు. అయితే చాక్లెట్ అతిగా తింటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక క్యాలరీలు, చక్కెర తీసుకోవడం వల్ల ఊబకాయం పెరుగుతుంద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: గుడ్లు ఇలా ఉడికిస్తే క్యాన్సర్ గ్యారంటీ!!
ముఖ్యంగా మిల్క్, వైట్ చాక్లెట్లలో చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. అధిక చక్కెర, శాచురేటెడ్ ఫ్యాట్ ఎల్‌డీఎల్ చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి గుండెపోటుకు దారి తీయవచ్చు. రోజుకు 500 గ్రాముల చాక్లెట్ తింటే గుండెపోటు వచ్చే ప్రమాదం అధికమని పరిశోధనలు సూచిస్తున్నాయి. అధిక చాక్లెట్ వినియోగం మధుమేహం, రక్తపోటు సమస్యలకూ కారణమవుతుంది. అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. డార్క్ చాక్లెట్‌ను వారానికి కొన్ని ముక్కలు మాత్రమే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే చాక్లెట్ రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా ఉండగలమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: స్పెర్మ్ డొనేషన్‌కు ఎవరు అర్హులో.. ఎలా డొనేట్ చేయాలో తెలుసుకోండి