/rtv/media/media_files/2025/10/17/rice-flour-vs-face-beauty-product-2025-10-17-09-19-20.jpg)
Rice Flour vs Face Beauty Product
వంటగదిలో నిత్యం ఉపయోగించే పదార్థాలు కొన్నిసార్లు సౌందర్య రహస్యాలుగా(healthy life style) మారతాయి. అలాంటి వాటిలో బియ్యపు పిండి (Rice Flour) ఒకటి. అమ్మమ్మల కాలం నుంచి ఇది సౌందర్య సాధనాలలో(Face Beauty Product) భాగంగా ఉంది. బియ్యపు పిండి చర్మాన్ని శుభ్రపరచడం, బిగుతుగా ఉంచడం, కాంతివంతం చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. బ్యూటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చర్మ సంరక్షణకు బియ్యపు పిండి ఒక సహజ గృహ చిట్కాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఇంట్లోనే చర్మానికి సహజ సౌందర్యగా పని చేసే బియ్యం పిండితో ఫేస్ బ్యూటీ ప్రొడక్ట్ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
చర్మ సంరక్షణలో బియ్యపు పిండి:
బియ్యపు పిండి సహజ ఎక్స్‌ఫోలియేటర్ (Natural Exfoliator)గా పని చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి.. చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతుంది. ఇది చర్మాన్ని రుద్దడానికి (Scrubbing) ఉత్తమంగా పనిచేస్తుంది. ఎటువంటి చికాకు కలిగించదు. అంతేకాకుండా టానింగ్, పిగ్మెంటేషన్ ఉపశమనం ఇస్తుంది. బియ్యపు పిండిలోని సహజ బ్లీచింగ్ గుణాలు చర్మం రంగును తేలికపరిచి.. ఎండ వల్ల వచ్చే నలుపును (Tanning) తగ్గిస్తాయి. ఇది ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంపై వచ్చే మొటిమలు (Acne), చికాకును తగ్గిస్తాయి. అలాగే బియ్యపు పిండి బ్యాక్టీరియాను నియంత్రించి.. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. బియ్యపు పిండి చర్మాన్ని బిగుతుగా ఉంచి.. గట్టిపరుస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వలన ఫైన్ లైన్స్, ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. బియ్యపు పిండి చర్మంపై ఉన్న అదనపు జిడ్డును (Excess Oil) గ్రహించి చర్మానికి మాట్టే లుక్‌ను ఇస్తుంది. ఇది జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు రాకుండా.. చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: చర్మంతో పాటు పాదాలపై ఈ లక్షణాలు కనిపిస్తే ఆ విటమిన్ లోపమే.. దాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి
బియ్యపు పిండి ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్ధాలను ముందుగానే సిద్దం చేసుకోవాలి. అందుకోసం బియ్యపు పిండి 2 టీస్పూన్లు, రోజ్ వాటర్ 1 టీస్పూన్, పెరుగు లేదా కలబంద జెల్ (Aloe Vera Gel) 1 టీస్పూన్ తీసుకోవాలి. ఈ పదార్థాలను కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడకు సమానంగా అప్లై చేసి.. 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత తడి చేతులతో వృత్తాకార కదలికలలో (Circular Motions) సున్నితంగా రుద్దుతూ కడగాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వాడటం వలన సహజమైన మెరుపు మరియు శుభ్రమైన చర్మాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రాత్రి ఆలస్యంగా తినొద్దు.. అనారోగ్యం బారిన పడొద్దు.. ఎలానో ఇప్పుడే తెలుసుకోండి!!