/rtv/media/media_files/2025/10/13/vitamin-d-deficiency-2025-10-13-14-57-47.jpg)
Vitamin D deficiency
నేటి ఆధునిక, బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, సూర్యరశ్మికి దూరంగా ఉండటం వలన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాల లోపం ఏర్పడుతోంది. ముఖ్యంగా విటమిన్ డి (Vitamin D) లోపం వలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిని సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది సూర్యరశ్మి నుంని లభిస్తుంది. అయితే శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడు.. దాని ప్రభావాలు స్పష్టంగా చర్మం, కాళ్ళపై కనిపిస్తాయి. చాలా మంది దీనిని సాధారణ అలసటగా లేదా చర్మ సమస్యగా భావించి పట్టించుకోరు. వాటిని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి లోపం లక్షణాలతోపాటు చర్మం, కాళ్ళపై కనిపించే హెచ్చరికల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
చర్మంపై లక్షణాలు:
నిస్తేజంగా మారడం: చర్మం సహజమైన కాంతిని కోల్పోయి, నిర్జీవంగా కనిపిస్తుంది.
వర్ణద్రవ్యం-మచ్చలు: ముఖంపై మచ్చలు, నలుపు లేదా ప్యాచ్‌లు ఏర్పడతాయి.
పగుళ్లు: మడమలు పగలడం లేదా మోకాళ్ళ చుట్టూ చర్మం నల్లగా, గరుకుగా మారడం కూడా దీని సంకేతాలు కావచ్చు.
వృద్ధాప్య సంకేతాలు: దీర్ఘకాలికంగా విటమిన్ లోపం ఉంటే.. చర్మం స్థితిస్థాపకత తగ్గి, ముందుగానే వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!
కాళ్ళపై లక్షణాలు:
నిరంతర అలసట- నొప్పి: తరచుగా అలసటగా అనిపించడం, కాళ్ళలో నొప్పి, కండరాల బిగువు (muscle stiffness), మెట్లు ఎక్కడానికి కష్టపడటం వంటివి కనిపిస్తాయి.
తిమ్మిరి (Tingling), భారం: కాళ్ళు లాగినట్లు, తిమ్మిరిగా లేదా బరువుగా అనిపిస్తే అది విటమిన్ డి లోపానికి అంతర్గత హెచ్చరిక కావచ్చు.
పై లక్షణాల ఉంటే చూస్తే.. బలమైన ఎముకలు, కండరాల పనితీరు, రోగనిరోధక శక్తికి విటమిన్ డి చాలా అవసరం. ప్రతిరోజూ ఉదయం వేళల్లో లేత సూర్యరశ్మికి కొంతసేపు ఉండటం చాలా మంచిది. ఇది విటమిన్ డిని క్రియాశీలం చేయడమే కాక.. ఒత్తిడిని తగ్గిస్తుంది. సూర్యరశ్మి లభించని పక్షంలో.. విటమిన్ డి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం లేదా వైద్యుడిని సంప్రదించి సప్లిమెంట్లను వాడటం ఉత్తమం. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఎముకలు, కండరాల ఆరోగ్యం దెబ్బతిని.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: PCOD-PCOS రెండింటి మధ్య తేడా మీకు తెలుసా..?