/rtv/media/media_files/2025/10/17/dinner-2025-10-17-07-34-22.jpg)
Dinner
నేటి కాలంలో మంచి ఆరోగ్యం కోసం ఏం తింటున్నాము అనేదానితోపాటు.. ఎప్పుడు తింటున్నాము అనేది కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా రాత్రి భోజనం (late-night-dinner) ఆలస్యం చేస్తే.. అది నిద్ర, జీర్ణక్రియ, బరువు, రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం చాలా అవసరం. ఇటీవలి అధ్యయనాలలో.. రాత్రి ఆలస్యంగా భోజనం చేసేవారికి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు. ఈ సమస్యల్లో ముఖ్యంగా ఊబకాయం (Obesity) ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే ఆరోగ్యపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఆలస్యంగా తినడం వలన కలిగే దుష్ప్రభావాలు:
రాత్రి ఆలస్యంగా తినడం(dinner-time) వలన ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆలస్యంగా తినేవారిలో ఆకలిని నియంత్రించే హార్మోన్లైన లెప్టిన్, గ్రెలిన్ ప్రభావితమవుతాయి. కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే లెప్టిన్ హార్మోన్ స్థాయిలు ఆలస్యంగా తినేవారిలో తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. రాత్రి 11 గంటల తర్వాత భోజనం చేసేవారిలో కేలరీలు కరిగే రేటు (Calorie Burn Rate) కూడా నెమ్మదిస్తుంది, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. భోజన సమయాల్లో మార్పులు శరీరం యొక్క సర్కాడియన్ రిథమ్ (శరీర గడియారం)పై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆలస్యంగా భోజనం చేయడం వలన బరువుతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఆలస్యంగా తినేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి, కొవ్వు కరిగే ప్రక్రియ కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: థ్రెడింగ్ ఇంకా వాక్సింగ్ మధ్య ఎంతో తేడా ఉంది.. అదేంటో మీరూ తెలుసుకోండి!!
అయితే రోజువారీ దినచర్య సర్కాడియన్ రిథమ్‌కు అనుగుణంగా లేకపోతే.. గ్లూకోజ్‌ను శరీరం సమర్థవంతంగా వినియోగించుకోలేదు. రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వలన టైప్ 2 డయాబెటిస్, దాని సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. మనం పడుకోవడానికి 2-3 గంటల ముందు రాత్రి భోజనం చేస్తే... శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సమయం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ పడుకోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందు రాత్రి భోజనం పూర్తి చేయాలి. రాత్రి 10 గంటలకు పడుకోవాలంటే.. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య భోజనం చేయడం ఉత్తమం. ఈ సమయం జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: హెయిర్ స్పాకి వెళ్ళేముందు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే మీ జుట్టు సంగతి అంతే!!