Hot Water: వేడి నీటిని తాగేవారికి అలర్ట్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఫిట్‌నెస్ యుగంలో.. బరువు తగ్గడానికి ఏ చిట్కానైనా అనుసరిస్తారు. వేడి నీరు కొవ్వును కరిగించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తిగా వేడి నీరు తాగడం వల్ల నోరు, గొంతు, కడుపు లోపలి పొర దెబ్బతినే అవకాశం ఉందటున్నారు.

New Update
lose weight Vs Hot Water

lose weight Vs Hot Water

Hot Water: వేడి నీటి వినియోగం జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. అనేక అవసరాలకు వేడి నీటిని ఉపయోగిస్తాం. వేడి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం, ఆధునిక వైద్యం కూడా చెబుతున్నాయి. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాల నొప్పి తగ్గి చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. అయితే.. వేడి నీటిని సరైన పద్ధతిలో, సరైన ఉష్ణోగ్రతలో ఉపయోగించడం చాలా ముఖ్యం. అతి వేడిగా ఉన్న నీటిని తాగడం, స్నానం చేయడం చర్మానికి.. అంతర్గత అవయవాలకు హాని కలిగించవచ్చు. కాబట్టి.. వేడి నీటిని మితంగా.. అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి వేడినీరు తాగితే చేయకుడ తప్పుల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

వేడినీరు తాగే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

నేటి ఫిట్‌నెస్ యుగంలో.. బరువు తగ్గడానికి ఏ చిట్కానైనా అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పద్ధతులలో వేడి నీరు తాగడం కూడా ఒకటి. వేడి నీరు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ వేడి నీటిని సరైన పద్ధతిలో తీసుకోకపోతే.. అది ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి హాని కూడా కలిగిస్తుందని చాలా మందికి తెలియదు. కొందరు వేడి నీటిని ఎంత ఎక్కువగా తాగితే అంత త్వరగా కొవ్వు తగ్గుతుందని అనుకుంటారు. కానీ అతిగా వేడి నీరు తాగడం వల్ల నోరు, గొంతు, కడుపు లోపలి పొర దెబ్బతినే అవకాశం ఉంది. ఉదయం లేవగానే ఏమీ తినకుండా వేడి నీరు తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి అధికమై వికారం, వాంతులు, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పిస్తాపప్పు విటమిన్ లోపాన్ని తొలగిస్తుందా..? తినడానికి సరైన సమయం తెలుసా..!!

భోజనం త్వరగా జీర్ణం అవుతుందని భావించి.. తిన్న వెంటనే వేడి నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల పనితీరు ప్రభావితమై ఆహారం సరిగా జీర్ణం కాదు. ప్రతి గంటకు వేడి నీరు తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే శరీరానికి అవసరమైన మినరల్స్ బయటకు వెళ్లిపోయి, అలసట, నీరసం కలగవచ్చు. మరిగే నీటిని కొద్దిగా చల్లార్చకుండా తాగడం వల్ల నోటిలోని సున్నితమైన పొరలు కాలిపోవచ్చు, లాలాజలం యొక్క సహజ సమతుల్యత దెబ్బతినవచ్చు. దీర్ఘకాలంగా ఇలా చేయడం వల్ల గొంతుకు శాశ్వత నష్టం కలగవచ్చు. సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌లో చూసి వేడి నీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి వ్యక్తి శరీరం, వాతావరణం, ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఏదైనా అలవాటును ప్రారంభించే ముందు వైద్య పరీక్షలు చేయించుకుని.. డాక్టర్ సలహా తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:ఈ గింజలతో ఒంట్లో కొవ్వు పరార్‌... బరువు తగ్గాలంటే సరైన మార్గం ఇదే..!!

Advertisment
తాజా కథనాలు