/rtv/media/media_files/2025/08/07/flax-seeds-2025-08-07-06-51-46.jpg)
Flax Seeds
Flax Seeds: అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిన్న గింజలు. ఇవి పోషకాల గని అని చెప్పవచ్చు. పురాతన కాలం నుంచి వీటిని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను సులభతరం చేయడంలో, శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అవిసె గింజలను పొడిగా చేసి, నూనె రూపంలో తీసుకోవచ్చు. ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. చాలా రకాల డైట్ టిప్స్, ఆహారాల గురించి తెలుసుకుంటారు. కానీ బరువు తగ్గించే ప్రయత్నంలో చాలా ప్రయోజనకరంగా ఉండే ఒక సాధారణ, దేశీ సూపర్ ఫుడ్‌లో ఒకటి అవిసె గింజలు. ఇవి బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి సహాయపడే..
అవిసె గింజల్లో ఉండే ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల జీవక్రియను పెంచడమే కాకుండా.. శరీరంలోని కొవ్వును కరిగించే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాయి. అవిసె గింజలను కొద్దిగా వేయించి పౌడర్‌గా చేసి ప్రతిరోజూ ఒక చెంచా గోరు వెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంలో కొవ్వు నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఒక చెంచా అవిసె గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని వడగట్టి తాగాలి. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. జీవక్రియను పెంచి బరువు తగ్గడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: తల్లిపాలు ఇవ్వడం వల్ల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందా..?
అవిసె గింజల పౌడర్‌ను స్మూథీ, పెరుగు, ఓట్స్‌లో కలిపి తినాలి. ఇది ఆరోగ్యకరమైన ఫైబర్‌ను అందిస్తుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. తద్వారా అతిగా తినడం అలవాటు తగ్గిస్తుంది. రోజుకు 1 నుంచి 2 చెంచాల కంటే ఎక్కువ అవిసె గింజలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులో గ్యాస్, ఉబ్బరం లేదా విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలామంది పచ్చి అవిసె గింజలను నములుతుంటారు. వాటి పై పొర గట్టిగా ఉండటం వల్ల సరిగ్గా జీర్ణం కాదు, శరీరం వాటిని పూర్తిగా గ్రహించుకోలేదు. గర్భిణీగా ఉన్నా, పాలిస్తున్నట్లయితే, ఏదైనా మందులు వాడుతున్నట్లయితే.. అవిసె గింజలను తీసుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి. అవిసె గింజలు కొన్ని ఆరోగ్య సమస్యల విషయంలో హార్మోన్ల ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కళ్ళకు దోసకాయతో రిలాక్స్.. నల్లటి వలయాలతోపాటు వాపు నుంచి ఉపశమనం