/rtv/media/media_files/2025/05/22/XWtqcoM2GCJNW3siRzbr.jpg)
Pregnancy Special Care
Pregnancy Special Care: తల్లి అవటం మహిళకు దేవుడు ఇచ్చిన గొప్ప అదృష్టం అంటారు. మహిళ గర్భధారణ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నేటి కాలంలో అలాంటి పరిస్థితులు చాలా తక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేస్తూ బిజిబిజిగా ఉంటున్నారు. ఇలాంటి వారు గర్భధారణలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలంటే తగిన సమయం ఉండదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేరు. మరి కొందరిలో ఫ్యామిలీ సపోర్టు తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ఆరోగ్యపై శ్రద్ధ పెట్టకపోతే తల్లి బిడ్డకు ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో పని చేయడం ఏ ఉద్యోగికైనా పెద్ద సవాలుగా ఉంటుంది. కానీ సరైన దినచర్య, కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకుంటే.. తల్లి, బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉండగలదని నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాల గురించి కొన్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం:
గర్భధారణలో శరీరానికి అదనపు పోషణ అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం శక్తితోపాటు పిల్లల అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుంది. గర్భిణి మహిళలు తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, చిరు ధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం, బాదం, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష వంటి గింజలను తీసుకోవాలి. స్పైసీ, జంక్ ఫుడ్‌కు చాలా దూరంగా ఉండాలి. ఇవి గ్యాస్, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. హైడ్రేటెడ్‌గా ఉండాలంటే రోజులో కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు, తాజా రసం కూడా తీసుకోవాలి. ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి 30-40 నిమిషాలకు లేచి నడవాలి. కుర్చీపై కూర్చున్నప్పుడు వీపును నిటారుగా ఉంచి పాదాలను నేలపై ఆనించాలి.
ఇది కూడా చదవండి: షుగర్ రోగులకు మెంతి నీరు అమృతం.. ఇలా తయారు చేసుకోండి
అలాగే వెన్నునొప్పిని నివారించడానికి ఆఫీసు కుర్చీపై ఒక కుషన్, సపోర్ట్ ఉంచాలి. తేలికపాటి యోగా చేస్తే శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపడి శరీరం రిలాక్స్ అవుతుంది. పనితోపాటు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా అవసరం. కాబట్టి ప్రతి 1-2 గంటలకు 5-10 నిమిషాలు విరామం తీసుకోవాలి. అలసిపోయినట్లు అనిపిస్తే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు లోతుగా శ్వాస తీసుకోవాలి. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. తేలికపాటి వ్యాయామం, యోగా శరీరాన్ని చురుగ్గా, సరళంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రన్నింగ్ బస్‌కు వేళాడుతూ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. షాకింగ్ వీడియో!
( pregnancy | pregnancy-care | pregnancy-care-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)