HYD: రన్నింగ్ బస్‌కు వేళాడుతూ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. షాకింగ్ వీడియో!

హైదరాబాద్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో ఆర్టీసీ సిటీ బస్సు డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించిన వీడియో వైరల్‌గా మారింది. ఆటో డ్రైవర్ తన ట్రాన్స్‌పోర్ట్ వాహనానికి బస్సు దారి ఇవ్వలేదని ఆగ్రహంతో బస్సును అడ్డగించి డ్రైవర్‌ ఫోన్ లాకొన్నాడు.

New Update
hyd news

hyd news

Hyd News: హైదరాబాద్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో ఆర్టీసీ సిటీ బస్ డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించిన ఘటన వీడియో కలకలం రేపుతోంది. కాచిగూడ నుంచి పటాన్ చెరుకు వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ తన ట్రాన్స్‌పోర్ట్ వాహనానికి బస్సు దారి ఇవ్వలేదని ఆగ్రహంతో రియాక్ట్ అయ్యాడు. వెంటనే బస్సును అడ్డగించి డ్రైవర్‌ ఫోన్ లాక్కొని, బస్సు రన్‌లో ఉన్నప్పటికీ కిటికీ దగ్గర నుంచి డ్రైవర్‌ను చేతితో పట్టుకుని బస్సు నడపనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా తాళాలు లాగే ప్రయత్నం కూడా చేశాడు.

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..

ఈ ఘటనను అక్కడే ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు ఆటో డ్రైవర్ ప్రవర్తనపై తీవ్రంగా స్పందిస్తూ.. బస్సులో పలు ప్రయాణికులు ఉన్నాయన్న బాధ్యత లేకుండా ఈ విధంగా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కొందరు వచ్చి పరిస్థితిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇది జరిగిన తీరు చూసి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు సంబంధిత అధికారులు, పోలీసులు చురుగ్గా వ్యవహరించాలని కోరుతున్నారు.

 

ఇది కూడా చదవండి: హైదరాబాద్ SBIలో గోల్డ్ లోన్ కుంభకోణం.. రూ.2 కోట్లు కొట్టేసిన ఉద్యోగులు.. అసలేమైందంటే?

( latest-news | ts-news | tsrtc)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు