/rtv/media/media_files/2025/08/07/coconut-water-2025-08-07-08-43-12.jpg)
Coconut Water
Coconut Water: కొబ్బరి నీళ్ళు, ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పానీయం. ఇది సహజంగా తీయగా.. పునరుత్తేజకరంగా ఉంటుంది. ఈ నీరు శరీరాన్ని చల్లబరచడానికి.. డీహైడ్రేషన్ నుంచి రక్షించడానికి కొబ్బరి నీళ్ళు ఉత్తమమైనవి. ఇందులో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ద్రవ సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. కొబ్బరి నీళ్ళు కేవలం దాహం తీర్చడమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి జీర్ణక్రియను, రక్తపోటును నియంత్రిస్తాయి, చర్మానికి మంచి మెరుపును ఇస్తాయి. క్రీడాకారులకు, వ్యాయామం చేసేవారికి కొబ్బరి నీళ్ళు శక్తినిచ్చే పానీయంగా ఉపయోగపడతాయి. అయితే పచ్చి కొబ్బరి నీళ్ళు తాజావిగా ఉన్నప్పుడే తాగడం మంచిదంటున్నారు. ఏ రోగులు కొబ్బరి నీళ్ళు తాగకూడదో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కొబ్బరి నీటిని మానుకోవాల్సిన వ్యక్తులు:
కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా.. శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. కొబ్బరి నీళ్ళలో సహజంగా పొటాషియం, ఇతర ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. అయితే ఈ పోషకాలు సమృద్ధిగా ఉండే కొబ్బరి నీరు అందరికీ మంచిది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్ళను అస్సలు తాగకూడదని డైటీషియన్లు సూచిస్తున్నారు. నిపుణులు ప్రకారం.. కిడ్నీ వ్యాధులు, అధిక పొటాషియం ఉన్న, తక్కువ రక్తపోటు, డయాబెటిస్ ఉన్న రోగులు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. జీర్ణ సమస్యలు, కొబ్బరితో అలెర్జీ ఉంటే కొబ్బరినీరు తాగవద్దు. ఏ ఆరోగ్య సమస్య ఉన్నవారైనా వారి ఆహారంలో దీనిని చేర్చుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం. కొబ్బరి నీటిలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో.. కిడ్నీలు అదనపు పొటాషియంను ఫిల్టర్ చేయలేవు. దీనివల్ల శరీరంలో పొటాషియం స్థాయి పెరిగి, గుండె సంబంధిత సమస్యలు అధికమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పాదాలు చల్లగా ఉంటున్నాయా? ఇది అనారోగ్య సమస్య కావచ్చు!
కొబ్బరి నీరు రక్తపోటును తగ్గిస్తుంది. ఇప్పటికే తక్కువ రక్తపోటుకు సంబంధించిన మందులు తీసుకుంటున్నట్లయితే.. కొబ్బరి నీరు తాగడం వల్ల రక్తపోటు మరింత తగ్గి.. మైకం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు రావచ్చు. కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు ఉంటాయి. డయాబెటిస్ ఉండి.. ఇన్సులిన్, మందులు తీసుకుంటున్నట్లయితే.. ఎక్కువ కొబ్బరి నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. దానిని తాగే ముందు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది. అథ్లెట్లకు వ్యాయామం తర్వాత హైడ్రేషన్ అవసరం. కానీ కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఎక్కువ చెమట పట్టినప్పుడు శరీరం నుంచి సోడియం తగ్గుతుంది. అందుకే వీరు సోడియం, కార్బోహైడ్రేట్లు రెండూ ఉన్న స్పోర్ట్స్ డ్రింక్ తీసుకోవడం మంచిది. కొబ్బరి నీరు ఆరోగ్యకరమైనదే.. కానీ ఏదైనా ఆనారోగ్య సమస్య ఉంటే ఆహారంలో దానిని చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వేడి నీటి వినియోగం అనారోగ్యమా..? హాని-తప్పులను తెలుసుకోండి..!!