Milk: పాలు, గుడ్లు ఒకేసారి తీసుకుంటే ఏమౌతుంది?

కొన్ని ఆహార పదార్థాల కాంబినేషన్లు శరీరానికి మంచిది కావు. ఉడికించిన గుడ్లు తిన్న తర్వాత పాలు తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉడికించిన గుడ్లు తిన్నాక అవసరమైతే పాలు తీసుకోవాలని నిపుణులంటున్నారు.

New Update
milk and eggs

milk and eggs

Milk: కోడి గుడ్లు, పాలు రెండూ మానవ శరీరానికి అత్యవసరమైన పోషకాలను అందిస్తాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అయితే ఈ రెండింటిని కలిపి ఒకేసారి తీసుకోవచ్చా..? అనే విషయంలో కొంత సందిగ్ధత ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. కొన్ని ఆహార పదార్థాల కాంబినేషన్లు శరీరానికి మంచిది కావు. కొంతమంది శరీరాలకు కొన్ని కాంబినేషన్లు జీర్ణించుకోవడం కష్టం కావచ్చు. ఉడికించిన గుడ్లు తిన్న తర్వాత పాలు తాగడం చాలా మందికి పెద్దగా ఇబ్బంది కలిగించదు. 

ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?

అజీర్ణం వంటి సమస్యలు..

కానీ కొన్ని సందర్భాల్లో కొంత మందికి గ్యాస్, కడుపు ఉబ్బరంగా ఉండటం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. అలాంటి వారు ఈ రెండు పదార్థాలను ఒకేసారి తీసుకోవడం మానుకోవాలి. ఎలాంటి సమస్యలు లేకపోతే మాత్రం గుడ్లు తిన్నాక పాలు తాగవచ్చు. ఇందులో ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే పచ్చి గుడ్ల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. పచ్చి కోడి గుడ్లలో సాల్మొనెల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఫుడ్ పాయిజన్‌, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా పచ్చి గుడ్లలో ఉండే అవిడిన్ అనే ప్రోటీన్ బయోటిన్ అనే విటమిన్‌ను శరీరానికి అందకుండా అడ్డుకుంటుంది.

ఇది కూడా చదవండి: పుచ్చకాయ విత్తనాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఉడికించిన గుడ్లు లేదా ఆమ్లెట్ రూపంలో తీసుకోవడం ఆరోగ్యకరంగా ఉంటుంది. బాడీబిల్డింగ్ చేసేవారు ఎక్కువగా పచ్చి గుడ్లను పాలతో కలిపి తాగే అలవాటు కలిగి ఉంటారు. కానీ న్యూట్రిషనిస్టులు మాత్రం ఈ విధానం మంచిదికాదని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పచ్చి గుడ్లకు బదులుగా ఉడికించిన గుడ్లను తీసుకోవడం, అవసరమైతే ఆ తర్వాత పాలను తీసుకోవడం ఉత్తమం. ఈ కాంబినేషన్ వల్ల ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగితే ఈ పదార్థాలను కలిపి తీసుకోవడం పూర్తిగా మానుకోవడం మంచిది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారాన్ని ఎంచుకోవాలి.

ఇది కూడా చూడండి:Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అరటిపండే కాదు.. దాని తొక్కతోనూ బోలెడు ప్రయోజనాలు


( egg | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | telugu-news | latest-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు