/rtv/media/media_files/2025/05/03/sJivScMeWdZIOAzZm6kA.jpg)
Banana Peel
Banana Peel: సాధారణంగా చాలామంది అరటి పండును తినేసిన తర్వాత తొక్కను పారేసేస్తుంటారు. ఈ అరటి పండు తొక్కల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. అరటి పండు ఎంతగానో శరీరానికి మంచిది. దాని తొక్కలు కూడా అంతే ఉపయోగకరమైనవి. వీటిని నేరుగా తినడం కొంత మందికి కొత్తగా అనిపించవచ్చు కానీ ఆయుర్వేదంలో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అరటి పండు తొక్కలోని లోపలి భాగాన్ని ముఖంపై రాస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం మీద ముడతలు తగ్గుతాయి. కళ్ల వాపులకు ఉపశమనం కలుగుతుంది.
Also Read : రాత్రి పూట ఆనందంగా బిర్యానీ తిన్నారు. మరునాడు తీరని విషాదం
చర్మం సమస్యలకు ఉపశమనం..
చలికాలంలో చర్మం పొడిబారిపోయినప్పుడు ఈ తొక్కల్ని రాయడం వల్ల తేమ లభించి చర్మం మృదువుగా మారుతుంది. మొటిమల మీద తొక్కను మర్దన చేస్తే అవి తగ్గుతాయి. సోరియాసిస్ ఉన్నవారు ఈ తొక్కల్ని అప్లై చేస్తే దురద, పొడిబారిన చర్మం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. పులిపిరి కాయలపై ఈ తొక్కను ఉంచితే అవి సహజంగానే తగ్గుతాయి. ఇవి గాయాలపై కూడా నయం చేస్తాయి. 2018లో జరిగిన పరిశోధనల ప్రకారం.. అరటి పండు తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయని వెల్లడైంది. జుట్టు సమస్యలకూ ఈ తొక్కలు ఉపయోగపడతాయి. జుట్టుకుదుళ్లపై రాసిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.
ఇది కూడా చదవండి: ఈ మాంసం తింటే మీ పేగులు కుళ్లిపోతాయ్.. తప్పక తెలుసుకోండి!
అరటి పండు తొక్కలతో దంతాలు శుభ్రం చేస్తే అవి తెల్లగా మెరుస్తాయి. ఎండ వల్ల టాన్ అయిన చర్మానికి ఈ తొక్కలను అప్లై చేస్తే ఉపశమనం లభిస్తుంది. తలనొప్పి ఉన్నప్పుడు అరటి తొక్కలను నుదిటిపై, మెడపై ఉంచితే నొప్పి తగ్గుతుంది. ముళ్లు గుచ్చుకున్న చోట ఈ తొక్కను ఉంచితే అవి బయటకు రావడం సులభమవుతుంది. అరటిపండు తొక్కలతో లెదర్ షూస్, వెండి వస్తువులను శుభ్రం చేయవచ్చు. అలాగే ఈ తొక్కలతో సేంద్రీయ ఎరువులు తయారుచేసి తోటలో మొక్కలకు వినియోగించవచ్చు. నేరుగా తినలేనివారికి ఈ తొక్కలతో టీ, చట్నీ, స్మూతీ వంటి రూపాల్లో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా అరటి తొక్కలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.
Also Read : తెలంగాణలో మరో సరదా ఫెస్టివల్.. టమాటలతో కొట్టుకోవడమే.. ఎక్కడో తెలుసా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పుచ్చకాయ విత్తనాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
( banana-peel | benefits-of-banana-peel | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)