/rtv/media/media_files/2025/05/31/EJ65SYUnJQzJYlMfgEtM.jpg)
Mango
Mango: వేసవి కాలం వచ్చిందటే మామిడి పండ్లు ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ఈ సీజన్లో వీటిని తినడానికి చిన్న, పెద్ద అంతా ఇష్టం పడతారు. అయితే.. మామిడి పండ్లను తినడానికి ముందు నీటిలో కొంత సమయం నానబెట్టమని పెద్దలు సలహా ఇస్తారు. కానీ దీని వెనుక ఉన్న కారణం చాలామందికి తెలియదు. లేకపోతే మామిడి పండ్లను మార్కెట్ నుండి ఇంటికి తెచ్చిన తర్వాత కొంత సమయం నీటిలో నానబెట్టమని ఎందుకు సలహా ఇస్తారో..? అలా చేయడానికి సరైన మార్గం ఏమిటో..? ఈ రోజూ ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Also Read : ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన ఆర్మీ
మామిడి పండ్లను ఎందుకు నానబెట్టాలి:
మామిడి సాగు సమయంలో పురుగుమందులు, రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు పండ్ల తొక్కపై ఉండవచ్చు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అటువంటి సమయంలో ఈ పురుగుమందులు, రసాయనాలను తొలగించడానికి మామిడిని 15-20 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. కొన్నిసార్లు మామిడి పండ్లను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. నీటిలో నానబెట్టడం వల్ల ఈ రసాయనాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. మామిడికాయకు వేడి స్వభావం ఉంటుంది. దీని కారణంగా కొంతమందికి కడుపులో చికాకు, మొటిమలు, వేడి వంటి సమస్యలు రావచ్చు. కానీ మామిడికాయను నీటిలో కొంత సమయం నానబెట్టడం వల్ల దాని వేడి తగ్గుతుంది, జీర్ణక్రియకు తేలికగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: సింగిల్‌గా ఉంటే బ్రెయిన్ బాగా పని చేస్తుంది.. పెళ్లి చేసుకుంటే బుర్రపాడు పక్కా
మామిడి పండ్లను పొలాల నుండి మార్కెట్‌కు రవాణా చేసేటప్పుడు.. తొక్కపై దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా పేరుకుపోవచ్చు. కానీ నీటిలో నానబెట్టడం ద్వారా మామిడిపై ఉన్న ఈ మురికి శుభ్రం అవుతుంది. మామిడి తినడానికి సురక్షితంగా ఉంటుంది. మామిడి పండ్లను నానబెట్టడం వల్ల వాటి రుచి, ఆకృతి మెరుగుపడుతుందంటారు. ఇది ముఖ్యంగా చాలా తీపిగా, జ్యుసిగా ఉండే మామిడి పండ్లతో జరుగుతుంది. మామిడికాయను శుభ్రమైన నీటిలో దాదాపు అరగంట పాటు నానబెట్టాలి. మామిడికాయలను నానబెట్టడానికి గోరువెచ్చని నీటిని వాడాలి. కానీ వేడి నీటిని వాడవద్దు. నానబెట్టిన తర్వాత మామిడికాయను శుభ్రమైన నీటితో శుభ్రంగా కడిగి తొక్క తీసి తినాలి. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మామిడి రుచి చప్పగా ఉంటుంది. మామిడి పండ్లకు అలెర్జీ ఉంటే, ఏదైనా జీర్ణ సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మామిడిపండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read : ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ 5 ఫుడ్ ఐటెమ్స్ తినే మహిళలు ఎక్కువ కాలం యవ్వనంగా ఎలా ఉంటారు?
( mangoes-tips | health tips in telugu | latest health tips | best-health-tips | home-tips | home tips in telugu | Latest News)