/rtv/media/media_files/2025/04/16/o7SZAKEyzfWZE9D10kWW.jpg)
Mango Shake
Mango Shake: వేసవి వేడిలో మామిడి షేక్ తాగడం చాలా మంది ఇష్టపడే అలవాటు. మామిడి పండ్ల రుచితో పాటు, చల్లదనం కూడా అందించే ఈ షేక్ శరీరానికి తాత్కాలికంగా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ ఆరోగ్య పరంగా ఈ పానీయం కొందరికి మంచిది, మరి కొందరికి సరిపోదు. పండ్లలో రాజుగా పరిగణించబడే మామిడి పండ్లలో విటమిన్ A, C, E, K, B6, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో, జీర్ణవ్యవస్థను సమర్థంగా పనిచేయించడంలో, చర్మానికి ఆరోగ్యాన్ని ఇచ్చేలా సహాయపడతాయి.
బరువు తగ్గాలంటే ..
పాలు, మామిడి ముక్కలు కలిపి తయారు చేసే మ్యాంగో షేక్ వేడి వాతావరణంలో శరీరానికి తాత్కాలికంగా శక్తిని అందించి అలసటను తగ్గించగలదు. అయితే మామిడి షేక్‌ను తాగడంలో కూడా కొంత మితిమీరిన వినియోగం హానికరం కావచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు మామిడి షేక్‌ను దూరంగా ఉంచాలి. మామిడి షేక్‌లో సహజంగానే చక్కెర అధికంగా ఉండటమే కాకుండా మనం అదనంగా చక్కెరను కలిపే విధానం దీన్ని మరింత ప్రమాదకరంగా మార్చుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు, కాలేయ సమస్యలు ఉన్నవారు, అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారు కూడా ఈ షేక్‌ను తక్కువగా తాగడం మంచిది.
ఇది కూడా చదవండి: వేసవిలో చర్మ సమస్యలకు వేప ఆకులతో చెక్
మామిడి షేక్ రుచికరమైనదే అయినా రోజుకు ఒక చిన్న గ్లాసుకు పరిమితం చేయాలని అన్నారు. అదనంగా చక్కెర, ఐస్ క్రీమ్, క్రీమ్ వంటి పదార్థాలను కలపకుండా తినడం ఉత్తమం. మామిడి పండ్లను సహజంగా తీసుకోవడం, లేక షేక్‌ను తక్కువ మోతాదులో తాగడం వల్ల ఆరోగ్యాన్ని హానికరం కాకుండా మేలు చేస్తుంది. వేసవి కాలంలో మామిడి షేక్ తాగవచ్చు కానీ అది మిత మీరకుండా, ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుని తాగాలి. మీకు డయాబెటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే తీసుకోవడం ఉత్తమం. సరైన ఆహారం, పరిమిత మోతాదు అన్నివేళలా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: మహిళలు థైరాయిడ్ బాధితులుగా ఎందుకు మారుతున్నారు?
( mangoes | mango-leaves | mango-lassi | mangoes-tips | latest-news I health-tips | latest health tips | best-health-tips | health tips in telugu )