Mango Falooda: వేసవిలో చల్లదనాన్ని పంచే మామిడి ఫలూదా.. దీనిని సింపుల్‌గా ఇలా చేసుకోండి

వేసవి తాపాన్ని తీరుస్తూ రుచి ఇచ్చే వాటిల్లో మామిడి ఫలూదా ఒకటి. దీని తయారీ కోసం మామిడిగుజ్జు, సేమ్యా, పాలు, చక్కెర, ఐస్‌క్రీం, రోజ్ సిరప్, బాదం, పిస్తా, సబ్జా గింజలు అవసరం. దీనిని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.

New Update
Mango Falooda

Mango Falooda

వేసవి తాపాన్ని తీరుస్తూ రుచి, అందంతో ఆకట్టుకునే డెజర్ట్‌ మామిడి ఫలూదా. దీని తయారీ కోసం అవసరమైన పదార్థాలను సిద్ధంగా పెట్టుకోవాలి. తాజా మామిడి గుజ్జు, సన్నని సేమ్యా, పాలు, చక్కెర, ఐస్‌క్రీం, రోజ్ సిరప్, బాదం, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్‌తోపాటు కొద్దిగా సబ్జా గింజలు అవసరం ఉంటుంది. ముందుగా మామిడికాయను శుభ్రంగా కడిగి గుజ్జు తీయాలి. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి.. అవి ఉబ్బిన తర్వాత వాటిని తీసుకోవాలి. 

Also Read :  సంచలన తీర్పు.. లైంగిక వేధింపుల కేసులో 8మందికి జీవిత ఖైదు

తయారీ కోసం..

తర్వాతి సేమ్యాను నీటిలో ఉడికించి అవి మెత్తగా అయిన తర్వాత చల్లటి నీటిలో వేసి వడకట్టి పక్కన ఉంచాలి. ఇది జిగటగా కాకుండా ఉండేలా చేస్తుంది. మామిడి గుజ్జు తయారీలో మామిడిని ముక్కలుగా కోసి మిక్స్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో తీపి కోసం కొద్దిగా చక్కెర కలపవచ్చు. ఇది ఫలూదాకు సహజమైన రంగు, రుచి ఇస్తుంది. ఫలూదాలో పాలు మృదువైన టెక్స్చర్‌కు మూలం. పాలను కొద్దిగా మరిగించి చక్కెర కలిపి, చల్లారిన తర్వాత కొద్దిగా రోజ్ సిరప్ కలిపితే ఫలూదాకు ఒక ప్రత్యేకమైన సుగంధంగా పని చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఎండిన కొబ్బరితో గుండెకు ప్రయోజనకరం.. బరువు తగ్గడానికి బెస్ట్ ఫుడ్

ఇంతవరకు సిద్ధమైన పదార్థాలతో ఫలూదాను లేయర్‌లుగా ఏర్పాటు చేయాలి. పొడవైన గ్లాస్‌ తీసుకుని ముందు మామిడి గుజ్జు, తర్వాత సబ్జా గింజలు, సేమ్యా, తీపి పాలు అనే క్రమంలో లేయర్‌లుగా వేసుకోవాలి. చివరగా పైన ఒక స్కూప్ ఐస్‌క్రీం కలిపి, బాదం, పిస్తా, ఎండు ద్రాక్ష, మామిడి ముక్కలతో అలంకరించాలి. చల్లగా సర్వ్ చేసినప్పుడు ఈ మామిడి ఫలూదా తీపి, సుగంధం, టెక్స్చర్‌ అన్నింటినీ సమపాళ్లలో కలిపిన రుచి మరింత పెరుగుతుంది. వేసవిలో ఇంట్లో పిల్లలకి, పెద్దలకు ప్రత్యేకంగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: కాలేయ ఆరోగ్యానికి జుట్టు రాలడానికి సంబంధం ఏంటి...?

Also Read :  స్టూడెంట్‌తో కంప్యూటర్ టీచర్ రాసలీలలు.. ఇంట్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త!



(mangoes-tips | mango-lassi | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
తాజా కథనాలు