Liver Vs Hair
Liver Vs Hair: ఈ రోజుల్లో మారిన జీవనశైలి, ఒత్తిడి, పొరపాట్ల ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇది చిన్న విషయం అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తుంటే దీని వెనక గల అసలు కారణాలను గుర్తించ లేకపోతుంటారు. ఒత్తిడికి, జుట్టు రాలడానికి నేరుగా సంబంధం లేకపోయినా.. శరీరంలో జరిగే కొన్ని మార్పుల వలన ఇలా జరగవచ్చు. ముఖ్యంగా కాలేయ సంబంధిత వ్యాధులు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. కాలేయం శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో ఒకటి. ఇది శరీరంలో టాక్సిన్లను తొలగించడం, జీవక్రియల నిర్వహణ, హార్మోన్ల సమతుల్యత చేస్తుంది. కాలేయంలో సమస్యలు ప్రారంభమైనప్పుడు.. శరీరంలో పోషకాలు సరైన విధంగా గ్రహించబడవు. ఫలితంగా జుట్టు బలహీనపడుతూ, నెమ్మదిగా రాలడం మొదలవుతుంది.
ఐదు కాలేయ సంబంధిత వ్యాధులు:
జుట్టు రాలడానికి కారణమయ్యే ప్రధాన ఐదు కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నాయి. అలోపేసియా అరేటా, లివర్ సోరియాసిస్, లూపస్, అడిసన్ వ్యాధి, కొన్నిరకాల దీర్ఘకాలిక కాలేయ సంక్షోభాలు. అలోపేసియాలో వెంట్రుకల మూలాలు నష్టపోతాయి. సోరియాసిస్ వంటి వ్యాధుల్లో తల చర్మంపైగా ప్రభావితమవుతుంది. లూపస్, హార్మోన్ల మార్పులకు కారణమయ్యే అడిసన్ వ్యాధులు వంటి సమస్యల వల్ల జుట్టు, కనుబొమ్మల వెంట్రుకలు కూడా రాలిపోవచ్చు.
ఇది కూడా చదవండి: వేసవిలో పుచ్చకాయ ఆరోగ్యానికి హానికరం.. పొరపాటున వీరు తినకూడదు..!!
ఈ కారణంగా జుట్టు ఎక్కువగా రాలే సమస్య ఉంటే కేవలం హెయిర్ ట్రీట్మెంట్లపై కాకుండా.. లోపలి ఆరోగ్యాన్ని పరిశీలించడం ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాలేయ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కాలేయ వ్యాధుల విషయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే దీని ప్రభావం మిగతా అవయవాల పనితీరుపై కూడా పడుతుంది. వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం, శరీరంలో విటమిన్లు, మినరల్స్ లోపం లేకుండా చూసుకోవడం, వైద్య సలహాలను పాటించడం ద్వారా జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. కాలేయ ఆరోగ్యం బాగుంటే జుట్టు ఆరోగ్యం కూడా సహజంగానే మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కొత్తిమీర కాడల నీటితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
(health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)