Life Style: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. మీ ఆరోగ్యం సేఫ్..

ఇంటిని అందంగా ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని మొక్కలు ఉన్నాయి. తులసి, అలోవెరా, స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు గాలిలోని కలుషితమైన వాయువులను గ్రహించి ప్యూర్ ఆక్సిజన్ అందిస్తాయి.

New Update
Indoor Plants: కాలుష్యాన్ని నివారించే మొక్కలు.. ఇంటిలో ఉంటే అనారోగ్యం పారిపోతుంది

ఇండోర్ ప్లాంట్స్ ఇంటి అలంకరణ కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. స్వచ్ఛమైన గాలితో పాటు వాటి పచ్చదానంతో మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇంటిని అందంగా ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని మొక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. 

Also Read :  కేక పెట్టించిన కేకేఆర్.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్

స్పైడర్ ప్లాంట్

ఇండర్ ప్లాంట్ గా పెంచుకునే ఈ మొక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కార్బన్ మోనాక్సైడ్‌తో పాటు వాతావరణంలోని ఇతర కాలుష్యలను గ్రహిస్తుంది. అలాగే ఈ మొక్క కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు సూచన.ఇది విషపూరితమైనది కూడా కాదు. కావున దీనిని ఇంట్లో ఉంచడం సేఫ్ గా భావించవచ్చు. 

కలబంద మొక్క

సాధారణంగా  కలబంద మొక్క  అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.  ఈ మొక్క గాలిలోని  బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన రసాయనాలను తొలగిస్తుంది. అలాగే కలబంద ఆకుల్లోని జెల్ చర్మ సౌందర్యం, జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది. అంతేకాదు కాలిన గాయాలు, కట్స్ వంటి నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. 

Also Read :  విషాదం.. వడ్ల మిషన్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

తులసి మొక్క

తులసి మొక్క ఆరోగ్యంతో పాటు ఔషద గుణాలను కలిగి ఉంటుంది. తులసి ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది శరీరం జలుబు, దగ్గు, అలెర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది.

Also Read :  నా తండ్రితో పడుకో.. లేదంటే! భార్య నగ్నవీడియోలు తీసి భర్త వేధింపులు!

పాము మొక్క

దీనిని బెడ్ రూం ప్లాంట్ లేదా సాన్సేవిరియా ట్రైఫాసియాటా వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఈ ప్లాంట్ వాయు కాలుష్యాన్ని తగ్గించి.. గాలిని శుద్ధి చేయడానికి పనిచేస్తుంది. ఈ మొక్క ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది రాత్రిపూట కూడా గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

పీస్ లిల్లీ

పీస్ లిల్లీ కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించి..  గాలిని శుద్ధి చేయడానికి పనిచేస్తుంది. 

Also Read :  రైల్వేలో 9,970 పోస్టులు.. మరో వారం రోజులే గడువు - అర్హతలివే

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 

life-style | latest-news | health | indoor-plants | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు