/rtv/media/media_files/2025/05/04/IgSAsxAmXEZqOEFSX9cy.jpg)
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ కోల్‌కత్ నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 207 టార్గెట్ ఉంది.
Also Read : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్
ఎవరెన్ని కొట్టారంటే?
కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రూ రసెల్ 25 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. అలాగే, రఘువంశీ 31 బంతుల్లో 44 పరుగులతో మెరిసారు. మిగతావారు చేతులెత్తేశారు. సునీల్ నరేన్ 9 బంతుల్లో 11 పరుగులు, కెప్టెన్ రహానే 24 బంతుల్లో 30 పరుగులు, గుర్బాజ్ 25 బంతుల్లో 35 పరుగులు, రింకు సింగ్ 6 బంతుల్లో 19 నాటౌట్‌గా మిగలాడు. ఆర్ఆర్ బౌలర్లలో ఆర్చర్ 1 వికెట్, యుధ్వార్ సింగ్ 1 వికెట్, తీక్షన్ 1 వికెట్, రియాన్ పరాగ్ 1 వికెట్ తీశారు.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
5 ఓవర్లకు స్కోర్ 43/1
10 ఓవర్లకు స్కోర్ 86/2
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ 8 ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలే సాధించిన కోల్‌కతా ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే కేకేఆర్ ఇంటిబాట పట్టాల్సిందే.
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
KKR vs RR | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news