/rtv/media/media_files/2025/05/11/0RU7m079vwNel1a9UcFt.jpg)
railway jobs
రైల్వే శాఖ ఇటీవల గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్ల పరిధిలోని అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అనుకున్న అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్) అర్హత ఉన్నవారు కూడా అర్హులు. రెండు స్టేజ్‌ల కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ ఉంటుంది. అనంతరం ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.
RRB రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, భోపాల్, బెంగళూరు, బిలాస్‌పూర్, భువనేశ్వర్, చెన్నై, చండీఘడ్, పట్నా, జమ్ము అండ్ శ్రీనగర్, గువాహటి, మాల్దా, కోల్‌కతా, ముజఫర్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ముంబయి, సికింద్రాబాద్, రాంచీ, తిరువనంతపురం, సిలిగురి, గోరఖ్‌పూర్.
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య- 9,970
రీజియన్ల వారీగా ఖాళీలు
అహ్మదాబాద్ - 497 పోస్టులు
అజ్మీర్ - 820 పోస్టులు
ప్రయాగ్‌రాజ్ -588 పోస్టులు
భోపాల్ - 664 పోస్టులు
భువనేశ్వర్ -928 పోస్టులు
బిలాస్‌పూర్ - 568 పోస్టులు
చండీఘడ్ - 433 పోస్టులు
చెన్నై - 362 పోస్టులు
ముజఫర్‌పూర్ - 89 పోస్టులు
Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!
పట్నా - 33 పోస్టులు
ప్రయాగ్‌రాజ్ - 286 పోస్టులు
రాంచీ - 1,213 పోస్టులు
సికింద్రాబాద్ - 1,500 పోస్టులు
సిలిగురి - 95 పోస్టులు
గువాహటి - 30 పోస్టులు
జమ్ము అండ్ శ్రీనగర్ - 08 పోస్టులు
కోల్‌కతా - 720 పోస్టులు
మాల్దా - 432 పోస్టులు
ముంబయి - 740 పోస్టులు
తిరువనంతపురం - 148 పోస్టులు
గోరఖ్‌పూర్ - 100 పోస్టులు
అర్హత: మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.04.2025.
దరఖాస్తుకు చివరి తేదీ: 11.05.2025.