/rtv/media/media_files/2025/05/04/53DNQSXZz5NCexuIC8h2.jpg)
Hyderabad crime wife
సాఫ్ట్‌వేర్ అని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని.. తీవ్ర వేధింపులకు గురి చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌కు చెందిన ఓ వైద్యురాలని(25) ఎల్లారెడ్డిగూడకి చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.
ఇది కూడా చూడండి: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
స్నానం చేస్తున్న వీడియోలు తీసి..
పెళ్లయిన తర్వాత భర్తకు ఉద్యోగం లేదని తెలిసినా కూడా ఆ యువతి సర్దుకుంది. అయినా భర్త అర్థం చేసుకోకుండా ఆమెను చిత్ర హింసలకు గురి చేసేవాడు. వీరికి ఓ పాప పుట్టటడంతో.. ఆడపిల్లను కన్నావని ఆమెపై దాడి చేసేశాడు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా ఆ యువతి సర్దుకుపోయింది. కానీ చివరకు ఆమె స్నానం చేస్తున్న వీడియోలు తీసి తండ్రికి చూపించాడు. దీంతో తండ్రి కూడా ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇది కూడా చూడండి: Cyber Crime : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
ఇటీవల ఆ భర్తే తండ్రి గదిలోకి పంపాడు. దీంతో ఆ యువతి అక్కడి నుంచి పరారై పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆ యువకుడు చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాదని, పోర్న్‌సైట్లలో యువతుల వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు అప్‌లోడ్ చేసే పనిచేస్తున్నారని విచారణలో తేలింది.
ఇది కూడా చూడండి: High Court : నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి.. GHMCకీ హైకోర్టు ఆదేశం
ఇది కూడా చూడండి: వారికి సెలవులు క్యాన్సిల్ చేయండి.. యుద్ధ వాతావరణంవేళ ఆర్మీ కీలక ప్రకటన!
latest-telugu-news | today-news-in-telugu | telangana crime news | telugu crime news | wife-and-husband