/rtv/media/media_files/2025/05/02/HVTYvBDA7nvS81r3D3ch.jpg)
Ice Cream
Ice Cream: వేసవి కాలం వచ్చిందంటే చల్లదనం కోసం ఐస్ క్రీం, శీతల పానీయాలపై జనాలు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా పిల్లలు, యువత ఈ ఉత్పత్తులపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వీటిపై ఒక ఆందోళన కలిగించే వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన దర్యాప్తులో చాలా ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ తయారీ యూనిట్లు నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం, కల్తీ పదార్థాలతో ఉత్పత్తులు తయారు చేయడం వెలుగులోకి వచ్చింది. తయారీ దారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకు డిటర్జెంట్లు, యూరియా, స్టార్చ్ కలిసిన సింథటిక్ పాలను ఉపయోగిస్తున్నారు.
నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తాయి..
ఇవి ఆరోగ్యానికి తీవ్రంగా హాని చేస్తున్నాయి. సాచరిన్ వంటి రసాయనాలను చక్కెరకు బదులుగా ఉపయోగించడం వల్ల రుచి ఉండవచ్చు కానీ ఆరోగ్యాన్ని పాడుచేస్తోంది. అలాగే శీతల పానీయాల్లో అధికంగా ఉపయోగించే ఫాస్పోరిక్ యాసిడ్ ఎముకలను బలహీనంగా మార్చడం, కండరాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంకా కల్తీ పదార్థాలు కలిసిన ఉత్పత్తుల వల్ల చిన్న పిల్లలకు కడుపునొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు, గొంతు నొప్పి, మంట, దగ్గు వంటి లక్షణాలు వెంటనే కనిపించవచ్చు. అలాగే డిటర్జెంట్లు మూత్రపిండాలపై ప్రభావం చూపుతాయి. నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తాయి. తయారీ కేంద్రాల్లో పరిశుభ్రత పాటించకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. కలుషిత నీటిని ఉపయోగించడం వల్ల అనేక రకాల క్రిములు, బ్యాక్టీరియా ఉత్పత్తుల్లో కలిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఈ మాంసం తింటే మీ పేగులు కుళ్లిపోతాయ్.. తప్పక తెలుసుకోండి!
ఇది శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుందంటున్నారు. పరిశుభ్రత లేకపోవడం, నిబంధనలను పట్టించుకోకపోవడం వల్ల ఈ తరహా కల్తీలు జరుగుతున్నాయి. తయారీ దారుల నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు. ఏదైనా కొనుగోలు చేసే ముందు దాని పదార్థాలను, తయారీ తేదీని, ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్‌ను చూడాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ తింటారు కాబట్టి తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో తయారు చేసిన సహజ పదార్థాలతో తయారయ్యే ఐస్ క్రీం వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించటం ఉత్తమ మార్గం. మార్కెట్లో దొరికే ప్రతి ఉత్పత్తిని నమ్మ వద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మొదట జాగ్రత్త అవసరం. ప్రభుత్వ సంస్థలు ఇలాంటి కల్తీని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: శుక్రవారం ఈ నైవేద్యాలు పెడితే అమ్మవారికి కోపం వస్తుంది
( ice-cream | ice-cream-benefits | natural-ice-creams | ice-cream-parlour | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )