/rtv/media/media_files/2025/05/01/trTpD0006jebNXwi6jTf.jpg)
Intestines
Intestinal Problems: పేగులు ఆరోగ్యంగా ఉండడం శరీరానికి ఎంతో అవసరం. జీర్ణ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేయాలంటే పేగులు ఆరోగ్యంగా ఉండాలి. అయితే నేడు అనేక మంది తాము తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపకుండా తరచూ హానికరమైన పదార్థాలు కలిగిన ఆహారాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో నూనెతో చేసిన వంటలు, వేడిచేసే తినుబండారాలు, సోడా లేదా మసాలాలు వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ పరిస్థితి క్రమంగా అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, కడుపులో మంట వంటి సమస్యలుగా మారుతుంది. ఈ దశలో పేగులు సహజంగా పనిచేయలేక పోతాయి.
పేగులలో హానికర బ్యాక్టీరియా పెరిగేలా..
కొన్ని ఆహారాలు తినడం వల్ల పేగులు లోపలి నుంచి కుళ్లిపోతూ క్రోనిక్ ఇన్‌ఫ్లమేషన్ లేదా IBS వంటి సమస్యలకు దారి తీస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసాహారం పేగులకు అత్యంత హానికరం. వీటిలో అధికంగా సోడియం, రసాయన పదార్థాలు, కృత్రిమ పదార్థాలు ఉంటాయి. ఇవి పేగుల గోడలను దెబ్బతీసి నెమ్మదిగా వాటి పనితీరును తగ్గిస్తాయి. ఈ ఆహారాలను తరచూ తీసుకుంటే పేగులలో కార్సినోజెనిక్ ప్రభావాలు కూడా రావచ్చు. అదే విధంగా జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్, నూడిల్స్, బిస్కెట్లు, చాక్లెట్ వంటి ఆహారాల్లో అధిక కొవ్వు, షుగర్, ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఇవి జీర్ణానికి పెద్ద అడ్డంకిగా మారుతాయి. పేగులలో హానికర బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. దీంతో జీర్ణవ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. బాగా వేయించిన, డీప్ ఫ్రైడ్ ఆహారాలు కూడా పేగులకు భారంగా మారతాయి.
ఇది కూడా చదవండి: పెరుగు వర్సెస్ మజ్జిగ.. జీర్ణక్రియకు ఏది మంచిది?
వేడి నూనెలో పదే పదే వేయించి చేసిన ఆహారం మలినాలతో నిండిపోతుంది. ఇవి శరీరంలోకి వెళ్లిన వెంటనే జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని పెంచుతాయి. నూనెల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ పేగుల చుట్టూ కొవ్వు పొరలను ఏర్పరచి జీర్ణంలో ఆటంకాన్ని కలిగిస్తాయి. స్వచ్ఛమైన పదార్థాలతో ఇంటి వద్దే చేసిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. అలాగే రోజుకు కనీసం రెండుసార్లు తాజా పండ్లు, పెరుగు వంటి ప్రొబయోటిక్ పదార్థాలు తీసుకోవడం ద్వారా పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. తగినంత నీరు తీసుకోవడం, ప్రాసెస్‌స్ ఫుడ్‌కు దూరంగా ఉండడం, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే పేగులు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సన్‌స్క్రీన్ చర్మ క్యాన్సర్‌ను తగ్గిస్తుందా?
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )