/rtv/media/media_files/2025/11/09/orange-peel-2025-11-09-11-21-41.jpg)
Orange Peel
నేటి కాలంలో కాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. శీతాకాలంలో పెరిగిపోయే కాలుష్యం, పొగమంచు శ్వాసకోశ సమస్యలను పెంచుతున్నాయి. వీధుల్లోని వాహనాల పొగ, ఫ్యాక్టరీలు, ఇంట్లో ఉపయోగించే గ్యాస్ స్టవ్‌లు, కొవ్వొత్తులు, స్ప్రే క్లీనర్‌లు కూడా ఇంటి లోపలి గాలిని విషపూరితం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇంటి గాలిని తాజాగా ఉంచడం కష్టం. అయితే మనమందరం పారవేసే నారింజ తొక్క(orange-peel) లతో ఇంట్లోని గాలిని శుభ్రం చేయడానికి ఒక సులభమైన చిట్కా ఉంది. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
నారింజ తొక్కలతో ఇంటి గాలిని శుద్ధి..
నారింజ తొక్కలు ఎలా సహాయపడతాయి: సాధారణంగా చెత్తగా పారేసే నారింజ తొక్కల్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్లు, కెరోటినాయిడ్లు వంటి పోషకాలు ఉన్నాయని 2023లో ప్రచురించబడిన ఓ అధ్యయనం పేర్కొంది. ఈ మూలకాలు శరీరంలోని కణాలకు ఆక్సీకరణ నష్టాన్ని (oxidative damage) తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా నారింజ తొక్కలోని తెల్లని లోపలి భాగం (ఆల్బెడో)లో ఈ ప్రయోజనకరమైన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. నారింజ తొక్కలలో రెండు ప్రధాన రకాల సమ్మేళనాలు ఉన్నాయి. టెర్పెన్స్ (Terpenes) నారింజకు సువాసనను ఇస్తాయి, పాలిఫెనాల్స్ (Polyphenols) యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ సమ్మేళనాలు కలిసి మూసి ఉన్న లేదా తగినంత వెంటిలేషన్ లేని గదులలో పేరుకుపోయే ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి వాయువులను తొలగించడంలో సహాయపడతాయి. దీనివల్ల గొంతు, కళ్లలో మంట తగ్గుతుంది. వంట చేయడం, శుభ్రం చేయడం లేదా కొవ్వొత్తుల నుంచి వచ్చే దుర్వాసన, వాయువులను తగ్గించడానికి ఈ పద్ధతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: ఒంటరిగా పడుకుంటే దెయ్యాలు రావు కానీ... ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి
నారింజ తొక్కలతో ఇంటి గాలిని శుద్ధి అవుతుంది. 2-3 నారింజ తొక్కలను శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక చిన్న పాత్రలో నీరు తీసుకొని, తొక్కలను వేసి 20 నుంచి 40 నిమిషాలు తక్కువ మంటపై మరిగించాలి. పాత్రపై మూత పెట్టకూడదు. నీరు ఆవిరైపోతుంటే.. మరికొంత నీటిని కలపవచ్చు. అదనపు సువాసన కోసం మీరు దాల్చిన చెక్క, లవంగాలు, బిరియానీ ఆకులను కూడా జోడించవచ్చు. మరిగేటప్పుడు పాత్రను ఎప్పుడూ గమనించకుండా వదిలివేయవద్దు. వీలైతే ఒక కిటికీని కొద్దిగా తెరిచి ఉంచాలి. కొద్ది నిమిషాల్లోనే గదిలో తాజాదనం కనిపిస్తుంది. వంట, శుభ్రం చేయడం వల్ల వచ్చే బలమైన వాసనలు తగ్గుతాయి. ఇంటి గాలి తేలికగా, తాజాగా అనిపిస్తుంది. ఇది వ్యర్థాలను ఉపయోగించి (waste-to-value) గాలి నాణ్యతను మెరుగుపరిచే చవకైన, సులభమైన పరిష్కారం. అయితే ఇది ధూళి, చిన్న కణాలపై పెద్దగా ప్రభావం చూపదని.. కేవలం గాలిని తాజాగా ఉంచే సులభమైన పద్ధతిగా మాత్రమే పరిగణించాలని గమనించాలి.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుందా..? పచ్చి మిర్చితో తగ్గించుకునే ఉపాయం తెలుసుకోండి!!
Follow Us