IDY 2025: డిజిటల్ ప్రపంచంలో యోగా ప్రశాంతత! ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి

ఆధునిక డిజిటల్ జీవనశైలిలో యోగా ఎలా ఒత్తిడిని తగ్గిస్తుంది? మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం కోసం యోగా ఎలా సహాయపడుతుంది? అనే అంశాలను ఇక్కడ తెలుసుకోండి.

New Update
IDY 2025

IDY 2025

ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో చేతిలో స్మార్ట్‌ఫోన్, కళ్ల ముందు ల్యాప్‌టాప్ స్క్రీన్, చెవిలో హెడ్‌ఫోన్లు - ఇవన్నీ మన దైనందిన జీవితంలో అంతర్భాగం అయ్యాయి. సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, అంతులేని నోటిఫికేషన్లు... ఇవన్నీ మనకు సౌలభ్యాన్ని అందిస్తున్నా, అదే సమయంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి సమస్యలను పెంచుతున్నాయి. ఈ డిజిటల్ ఉచ్చు నుంచి బయటపడి, ప్రశాంతమైన జీవితాన్ని గడపడం ఎలా అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. ఇక్కడే యోగా ఒక శక్తివంతమైన పరిష్కారంగా నిలుస్తుంది. 

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది  "ఒక భూమి, ఒక ఆరోగ్యం'' అనే థీమ్ తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని  జరుపుకోనున్నాము.  యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా, సమష్టి శ్రేయస్సుకూ దోహదపడుతుంది.

Also Read :  1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్

డిజిటల్ ప్రపంచంలో యోగా ఎలా సహాయపడుతుందో చూద్దాం

మానసిక ప్రశాంతత

నిరంతరం గ్యాడ్జెట్ల ముందు ఉండడం మనసును అలజడికి గురిచేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో  ప్రతిరోజూ యోగాలోని ప్రాణాయామం (శ్వాస వ్యాయామాలు), ధ్యానం చేయడం మనసును ప్రశాంతంగా ఉంచడానికి, వర్తమానంపై దృష్టి పెట్టడానికి సహాయపడతాయి. ఇది అనవసరమైన ఆలోచనల నుంచి మనసును విముక్తి చేస్తుంది.

Also Read :  ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?

yoga benefits
yoga benefits

ఏకాగ్రత మెరుగుదల

డిజిటల్ డిస్ట్రాక్షన్స్ వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. యోగాలోని ఆసనాలు, శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల మెదడు మెరుగుపడుతుంది.  ఇది పనిలో, రోజువారీ కార్యకలాపాల్లో ఏకాగ్రతను పెంచుతుంది.

శారీరక ఆరోగ్యం 

కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి, కీళ్ల నొప్పులు వస్తాయి. ఇలాంటి సమయంలో యోగా ఆసనాలు కండరాలను బలోపేతం చేసి, శరీరాన్ని సాగేలా చేస్తాయి. అలాగే  నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కంటి వ్యాయామాలు డిజిటల్ స్క్రీన్ వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తాయి.

Also Read :  తమ్ముడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు రమేష్

yoga
yoga

మెరుగైన నిద్ర

స్క్రీన్ టైమ్ ఎక్కువ కావడం వల్ల నిద్రలేమి సమస్య పెరుగుతుంది. యోగాలోని శ్వాస వ్యాయామాలు, తేలికపాటి ఆసనాలు శరీరంలో ప్రశాంతతను ప్రేరేపించి, నాణ్యమైన నిద్రకు సహాయపడతాయి.

డిజిటల్ డిటాక్స్

యోగా ప్రాక్టీస్ కోసం మీరు కొంత సమయం కేటాయించినప్పుడు, అది సహజంగానే స్క్రీన్ల నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఇది ఒక రకమైన డిజిటల్ డిటాక్స్ లా పనిచేస్తుంది, మనసుకు విశ్రాంతినిస్తుంది.

Also Read: Allu Arjun: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

 

telugu-news | international-yoga-day | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style

Advertisment
Advertisment
తాజా కథనాలు