/rtv/media/media_files/2025/10/16/indian-food-2025-10-16-12-04-18.jpg)
Indian Food
ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ఫుడ్స్(food) చాలా ప్రసిద్ధి చెందాయి. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారతీయులు తినే ఫుడ్ అనారోగ్యమని తెలిపింది. భారతీయులు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ప్రోటీన్(protiens) తక్కువగా ఉంటుంది. దీనివల్ల దేశంలో ఊబకాయం, మధుమేహం, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తున్నాయని తెలిపింది. ICMR(icmr-tips), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిర్వహించిన ఈ పరిశోధన భారతీయుల ఆహారాలపై పరిశోధనలు చేసింది. భారతీయ ఆహారంలో 65 నుంచి 70 శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయని, ప్రోటీన్ 10 శాతం మాత్రమే ఉంటుందని నివేదిక తెలిపింది. అంటే ప్రజలు వారికి ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని, ఆకలి తీర్చుకుంటారని.. కానీ శరీరానికి అవసరమైన పోషకాలను మాత్రం తీసుకోవడం లేదని వెల్లడించింది. ఇండియన్స్ ఎక్కువగా బియ్యం, రోటీ, బంగాళాదుంపలు వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు భారీగా పెరుగుతాయి. దీంతో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Diwali 2025: ఈ ఉప్పుతో అదృష్టం, ఐశ్వర్యం.. దీపావళి నాడు ఇంటికి తీసుకొస్తే అన్నింట్లో విజయం తథ్యం
🚨Indian diet contains 62% carbs, linked to rising diabetes, obesity rates: ICMR
— Shreya Shah (@ShreyaShah22) October 2, 2025
▶️A major survey by the ICMR reveals most Indians consume high-carbohydrate, low-protein diets, increasing their risk for diabetes and obesity.
▶️The study, published in Nature Medicine, showed… pic.twitter.com/hUnmMBikCH
ఇది కూడా చూడండి: Health Issues: అతిగా ఉప్పు తీసుకోవడం మానేస్తే.. సగం జబ్బులు మీకు తగ్గినట్లే!
తక్కువ ప్రొటీన్ తీసుకుంటున్నారని..
ఈ నివేదిక ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. కానీ చాలా మంది భారతీయులు కేవలం 35 నుంచి 40 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకుంటారు. పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, సోయా వంటి ప్రోటీన్లు భారతీయులు పెద్దగా తీసుకోవడం లేదు. దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు కండరాలు బలహీనంగా అవుతాయని తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు రైస్ తీసుకోగా.. ఉత్తర భారతదేశంలోని వారు ఎక్కువగా గోధుమలను తీసుకుంటారు. ఈశాన్య, తీరప్రాంతాలలో చేపలు, కొబ్బరి కొంత మంచి ప్రోటీన్‌ను తీసుకుంటారు. ఇలా చూసుకుంటే దేశం మొత్తం మీద తక్కువగానే ప్రొటీన్ తీసుకుంటున్నారు. భారతీయ ప్రజలు వెంటనే తమ ఆహారాన్ని మెరుగుపరచుకోవాలని ICMR సూచించింది. ప్రజలు తమ ఆహారంలో ధాన్యాలతో పాటు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోకపోతే భవిష్యత్తులో వ్యాధులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ ICMR నివేదిక ఆహారంలో 25 శాతం ప్రోటీన్, 50 శాతం కార్బోహైడ్రేట్లు, 25 శాతం ఆరోగ్యకరమైన కొవ్వుల వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని తెలిపింది. రోజూ పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, పెరుగు, సోయా, కూరగాయలను తీసుకోవాలని సూచించింది.