Diwali 2025: ఈ ఉప్పుతో అదృష్టం, ఐశ్వర్యం.. దీపావళి నాడు ఇంటికి తీసుకొస్తే అన్నింట్లో విజయం తథ్యం

దీపావళి రోజున ఉప్పును సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అదృష్టం కలసి వస్తుందని పండితులు అంటున్నారు. ఇంట్లో ఓ మూలన ఉంచితే నెగిటివ్ ఎనర్జీ పోతుందని, వ్యాపారంలో లాభాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

New Update
Diwali 5

Diwali

దీపావళి లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా భావిస్తారు. నిజానికి దీపమే లక్ష్మీదేవి అని, అందులో ఆమె కొలువై ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే దీపావళి రోజున ఇంటి మొత్తం దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపావళి రోజున ఉప్పును సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అదృష్టం కలసి వస్తుందని పండితులు అంటున్నారు. అదెలాగో మరి ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశి వారికి తిప్పని తప్పలు.. అమ్మాయిలతో జాగ్రత్త.. లేకపోతే ఊహించని పెద్ద ప్రమాదం!

నెగిటివ్ ఎనర్జీ దూరం

ఒక గాజు సీసాలో రాళ్ల ఉప్పు వేయాలి.  దీన్ని ఇంట్లో ఏదైనా ఒక మూల లేదా బాత్‌రూంలో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇంట్లో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు అంటున్నారు. 

వాస్తు సమస్యలు
ఇంట్లో వాస్తు సమస్యలు ఉంటే రాళ్ల ఉప్పు పెట్టాలి. దీంతో దీపం లేదా దిష్టి తీయడం వంటివి చేస్తే పోతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా స్నానం చేసే గదిలో ఒక మూలన గాజు గిన్నెలో ఉప్పు పెడితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు.

వ్యాపారంలో లాభాలు
ఇంటికి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఎర్రటి వస్త్రంలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి మూట కట్టి దాన్ని ఇంటి ముఖద్వారానికి కట్టాలి. ఈ విధంగా వ్యాపార స్థలాల్లో కూడా కట్టుకోవడం లేదా బీరువాలో పెట్టుకోవడం వలన వ్యాపారంలో లాభాలు వస్తాయని పండితులు అంటున్నారు. అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఉప్పును నీటిలో వేసి ఆ నీటితో కాళ్లు, చేతులు కడుక్కుంటే సుఖ నిద్ర పడుతుందట. పిల్లలకు కూడా వారానికి ఒకసారి ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయిస్తే రోగాలు రాకుండా ఉంటాయని నమ్ముతారు.

దిష్టి తీసిన ఉప్పును ఎక్కడ వేయాలి?
దిష్టి తీసిన ఉప్పును అందరూ నడిచే రోడ్లపైన వేయకూడదు. దిష్టిని పూర్తిగా తొలగించాలంటే ఆ ఉప్పును పారే నీటిలో గానీ, లేదా నిప్పుపై గానీ వేయాలి. నీటిలో వేస్తే దిష్టి ఆ నీటిలో కలిసిపోతుంది. నిప్పుపై వేస్తే అది చిటపటలాడుతూ అందులోని చెడు శక్తి అంతా కాలిపోతుందని చెబుతారు. అందుకే దిష్టి తీసిన ఉప్పును ఎప్పుడూ నీటిలో లేదా నిప్పుపై మాత్రమే వేయాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: Dhanteras 2025: ధంతేరాస్ నాడు పొరపాటున వీటిని ఇంటికి తీసుకొచ్చారో.. కటిక పేదరికం తప్పదు

Advertisment
తాజా కథనాలు