AC Temperature: ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఏసీ టెంపరేచర్‌ ఎంత ఉండాలి?

ఇంట్లో చిన్న పిల్లలు, ముఖ్యంగా 6 నెలల లోపు శిశువులు ఉంటే, ఏసీ వాడకంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల చర్మం మీద అలెర్జీలు, పొడి మచ్చలు, శరీరంలో తేమ తగ్గి డీహైడ్రేషన్ సమస్యలతోపాటు విరేచనాలకు దారితీస్తుంది.

New Update
AC

AC

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఏసీ వాడకము చాలా సాధారణమైంది. అయితే, ఇంట్లో చిన్న పిల్లలు, ముఖ్యంగా 6 నెలల లోపు శిశువులు ఉంటే, ఏసీ వాడకంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శిశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కొన్ని నియమాలు పాటించాలి. చిన్నారుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత కలిగిన ఏసీ గాలి వాళ్లు చర్మం పొడిబారే అవకాశముంది. దీని వల్ల చర్మం మీద అలెర్జీలు, పొడి మచ్చలు వంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా, శరీరంలో తేమ తగ్గి డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. ఇది విరేచనాలకు కూడా దారితీస్తుంది. 

Also Read :  అయ్యో బిడ్డలు.. తెలంగాణలో పెను విషాదం.. కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారుల మృతి!

శిశువుల ఆరోగ్యానికి హానికరం..

శిశువులు తమకు వచ్చే అసౌకర్యాన్ని చెప్పలేని వయసులో ఉంటారు కాబట్టి, తల్లిదండ్రులే జాగ్రత్తగా ఉండాలి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏసీ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండకూడదు. చాలా మంది వేడి నుంచి ఉపశమనం కోసం ఉష్ణోగ్రత 20-22 డిగ్రీలకు తగ్గిస్తారు. కానీ ఇది శిశువుల ఆరోగ్యానికి హానికరం. తక్కువ ఉష్ణోగ్రత వల్ల జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. ఆస్తమా ఉన్న పిల్లల్లో ఇది మరింత తీవ్రమవుతుంది. కొన్ని సందర్భాల్లో న్యూమోనియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏసీ వాడుతున్నప్పుడు గాలి బిడ్డపై ప్రత్యక్షంగా పడకుండా చూసుకోవాలి.

ఇది కూడా చదవండి: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

తల, కాళ్లను మృదువైన వస్త్రాలతో కప్పి ఉంచడం మంచిది. చల్లటి గాలి బిడ్డ శరీరంపై నేరుగా తాకినప్పుడు, అది చలికి లేదా చర్మ సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా, బిడ్డకు ఇప్పటికే శ్వాస సంబంధిత సమస్యలు లేదా చర్మ అలెర్జీలు ఉంటే, ఏసీలో పడుకోనివ్వకూడదు. అంతేకాక ఏసీ వాడుతున్న సమయంలో బిడ్డకు దగ్గు ప్రారంభమైతే వెంటనే ఏసీని ఆపాలి. గాలిలో తేమ ఉన్నట్లయితే హ్యూమిడిఫైయర్ వాడటం కూడా మంచిదే. ఏసీ వాడకం ఆరోగ్యానికి అనుకూలంగా ఉండాలంటే సరైన ఉష్ణోగ్రత, సరైన గాలి ప్రవాహం, తేమ స్థాయి వంటి విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే చిన్నారుల ఆరోగ్యాన్ని సురక్షితంగా నిలుపుకోవచ్చు.

Also Read :  చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్‌కౌంటర్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

(health tips in telugu | latest health tips | best-health-tips | AC Temperature | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు