/rtv/media/media_files/2025/04/14/GeJrwQnVNwbKiL9wcz8y.jpg)
vishaka crime
విశాఖపట్నం నగరంలోని పీఎం పాలెం ప్రాంతంలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. గర్భవతి భార్యను భర్తే గొంతునులిమి హత్య చేసిన సంఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న జ్ఞానేశ్వర్, అనూష దంపతుల మధ్య ఇటీవల కొన్ని విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భవతిగా ఉన్న అనూషకు మరికొద్ది గంటల్లో డెలివరీ జరగాల్సి ఉండగా, ఆమె భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు.
Also Read : మణిపూర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. వారి వద్ద ఏం దొరికాయో తెలుసా?
భార్యను బలి తీసుకున్న భర్త..
ఈ ఉదయం అనూష తీవ్ర అస్వస్థతకు గురైందని చెప్పి జ్ఞానేశ్వర్ తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం అనూష మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. పీఎం పాలెం పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా జ్ఞానేశ్వర్ అనూషను తానే హత్య చేశానని అంగీకరించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అనూషపై జ్ఞానేశ్వర్‌కు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఎండలో తిరిగి చర్మం నల్లగా మారిందా.. ఇలా చేస్తే మళ్లీ మెరుస్తుంది
అయితే ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అనూష కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భవతిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన జ్ఞానేశ్వర్‌కు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన విశాఖ నగరాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
Also Read : అందుకే పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నా: మొదటి పెళ్లిపై అఘోరీ సంచలన వీడియో!
(ap crime latest updates | ap-crime-news | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-crime-reports | telugu crime news | breaking news in telugu)