/rtv/media/media_files/2025/04/14/WIxJdrbGDkFoOOVUqD81.jpg)
Henna for hair
జుట్టుకు సహజంగా రంగు ఇచ్చే వాటిల్లో హెన్నా లేదా మెహందీ ఒకటి. ఇది సంప్రదాయమైన, ప్రాచీన పరిష్కారంగా చెబుతారు. ఇది ఎక్కువగా రసాయనాల ప్రభావం లేకుండా జుట్టు రంగును మార్చే పద్ధతిగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది తెల్ల జుట్టు ఉన్నవారు సహజంగా ఎరుపు రంగు కోసం హెన్నాను ఎంచుకుంటారు. ఇది తల చర్మాన్ని శీతల పరచడం, జుట్టును నిగారింపజేయడం వంటి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. అయితే దీన్ని తరచూ వాడటం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సహజమైనదని భావించి అధికంగా వాడటం మంచి విషయం కాదు. దీన్ని కూడా సమతుల్యంగా, జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది.
Also Read : అయ్యో బిడ్డలు.. తెలంగాణలో పెను విషాదం.. కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారుల మృతి!
జుట్టు సులభంగా విరిగిపోతుంది:
హెన్నాలో ఉండే టానిన్లు తల చర్మం నుండి సహజ తేమను, నూనెలను తొలగిస్తాయి. దీని వల్ల జుట్టు పొడిగా మారుతుంది. పొడిబారిన జుట్టు సులభంగా విరిగిపోతుంది, చిట్లిపోతుంది. అలాగే తరచూ హెన్నా వాడటం వల్ల జుట్టు సహజ మృదుత్వం పోతుంది. జుట్టు గరుకుగా మారిపోతుంది. కొంతకాలం తర్వాత జుట్టు సన్నబడటం మొదలవుతుంది. ఇది కేవలం జుట్టు రంగు మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుతుంది. ఇంకొక ప్రధాన సమస్య అలెర్జీ. హెన్నా సహజమైనదే అయినా కొందరికి ఇది తల చర్మంపై ప్రతికూలంగా పని చేస్తుంది. దురద, ఎరుపు, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ప్రత్యేకంగా సున్నితమైన స్కిన్ ఉన్నవారికి ఇది తీవ్రమైన ఇబ్బందిగా మారొచ్చు.
ఇది కూడా చదవండి: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
అందుకే ప్రతి సారి హెన్నా వేయడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. ఇంకా హెన్నాను తరచూ వాడటం వల్ల జుట్టుపై స్థిరంగా ఒక రంగు పొర పేరుకుపోతుంది. దీని వల్ల రంగు అసమానంగా కనిపించొచ్చు. అలాగే తరవాత సింథటిక్ రంగులు వేయాలనుకుంటే అవి సరిగ్గా పనిచేయక పోవచ్చు. ఈ స్థితిలో జుట్టు పూర్తిగా అసహజంగా మారుతుంది. హెన్నా వాడకాన్ని పరిమితంగా ఉంచడం ద్వారా దీని ప్రయోజనాలు పొందగలుగుతాం. నెలకు ఒకసారి లేదా అవసరమైనప్పుడు మాత్రమే వాడటం ఉత్తమం. హెన్నా ఒక మంచి సహజ ప్రత్యామ్నాయం అయినా దీన్ని అధికంగా వాడటం వల్ల జుట్టుకు కలిగే దుష్ప్రభావాలను నిర్లక్ష్యం చేయరాదు. జుట్టు ఆరోగ్యం కోసం దీన్ని సమతుల్యంగా ఉపయోగించాలి.
Also Read : 'జాగ్రత్త.. మీ వాట్సాప్ హ్యాక్ అవ్వొచ్చు'.. కేంద్రం హెచ్చరిక
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!
health tips in telugu | latest health tips | best-health-tips | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style | Henna