Brown Fat: సహజంగా జీవక్రియను మెరుగుపర్చే రహస్య శక్తి

శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ అనేది కొవ్వులో ప్రత్యేకమైనది. ఇది సాధారణ వైట్ ఫ్యాట్ కన్నా భిన్నంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బ్రౌన్ ఫ్యాట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి టైప్-2 మధుమేహం, చెడు కొలెస్ట్రాల్‌, గుండె, ఊబకాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

New Update
Brown Fat

Brown Fat

Brown Fat: శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ అనేది కొవ్వు ప్రత్యేకమైనది. ఇది సాధారణ వైట్ ఫ్యాట్ కన్నా భిన్నంగా పనిచేస్తుంది. బ్రౌన్ ఫ్యాట్ శరీరంలో ఉన్న కేలరీలను శక్తిగా మార్చి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ జీవక్రియ రేటును పెంచి అధిక కొవ్వు నిల్వలను తగ్గించి బరువును నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా బ్రౌన్ ఫ్యాట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి టైప్-2 మధుమేహం, చెడు కొలెస్ట్రాల్‌, గుండె ఆరోగ్యాన్ని, ఊబకాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బ్రౌన్ ఫ్యాట్ వలన ఇంక ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఏరోబిక్ వ్యాయామాలు..

బ్రౌన్ ఫ్యాట్‌ను యాక్టివేట్ చేయడానికి చల్లని ఉష్ణోగ్రతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరం చల్లనిగా ఉన్నప్పుడు, బ్రౌన్ ఫ్యాట్ ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడం కోసం కేలరీలను తగ్గిస్తుంది. రోజూ 15-20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కొంతసేపు గడపడం, చల్లని నీటితో స్నానం చేయడం, ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రతను తగ్గించడం వంటివి ఈ కొవ్వును ఉత్తేజ పరుస్తాయి. వ్యాయామం కూడా బ్రౌన్ ఫ్యాట్‌ను యాక్టివేట్ చేస్తుంది. ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామాలు, హై-ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ వంటి శారీరక శ్రమలు, రోజూ 30 నిమిషాల శారీరక శ్రమ, బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్‌ చేస్తే బ్రౌన్ ఫ్యాట్ పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: లిచీ పండుతో బోలెడు లాభాలు.. ఓ లుక్కేయండి!

ఆహారపు ఎంపికలు కూడా బ్రౌన్ ఫ్యాట్‌పై ప్రభావం చూపుతాయి. గ్రీన్ టీ, మిరపకాయలు, అల్లం, ఒమేగా-3, క్యాటెచిన్స్, క్యాప్సైసిన్ వంటివి శరీరంలో ఉష్ణ ఉత్పత్తిని పెంచుతాయి. వాల్‌నట్స్, అవిసె గింజలు, చేపలు, నాణ్యమైన నిద్ర, ఒత్తిడి నిర్వహణ కూడా బ్రౌన్ ఫ్యాట్‌పై ప్రభావం చూపుతాయి. అధిక ఒత్తిడి కారణంగా కార్టిసాల్ స్థాయిలు పెరిగితే బ్రౌన్ ఫ్యాట్ యాక్టివిటీ తగ్గుతుంది. రోజూ 8 గంటల నిద్రతోపాటు యోగా, ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఇవన్నీ కలిపి, బ్రౌన్ ఫ్యాట్‌ను యాక్టివేట్ చేయడానికి సమగ్ర జీవనశైలి, శారీరక శ్రమ, చల్లని వాతావరణంలో గడిపే సమయం, సమతుల్య ఆహారం, నిద్ర, మెరుగైన మానసిక ఆరోగ్యం ఇవన్నీ కలసి శరీరంలోని బ్రౌన్ ఫ్యాట్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ ముల్లు మొక్కలో అనేక ఔషధ గుణాలు తెలుసా..?

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips )

Advertisment
తాజా కథనాలు