/rtv/media/media_files/2025/10/22/wrinkles-face-2025-10-22-19-50-00.jpg)
Wrinkles face
వేగవంతమైన జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం కారణంగా చాలా మందికి వయస్సు రాకముందే ముఖంపై ముడతలు (Wrinkles), చర్మం వదులుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దాదాపు 30 ఏళ్ల నుంచే ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతున్నాయి. చర్మానికి కేవలం కాస్మెటిక్ ఉత్పత్తులను ఉపయోగించడం సరిపోదు. అసలైన అందం మన లోపలి నుంచి వస్తుంది. అంటే ఆహారం (Diet), జీవనశైలి చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖంపై ముడలకు కారణమయ్యే విటమిన్ లోపం ఏటో దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
విటమిన్ లోపం:
చర్మానికి ముందస్తు వృద్ధాప్యం రాకుండా నిరోధించడానికి యాంటీ ఆక్సిడెంట్లు చాలా ముఖ్యమైనవి. ఈ యాంటీ ఆక్సిడెంట్లలో ముఖ్యమైనవి విటమిన్ సి, విటమిన్ ఇ. ఈ విటమిన్ల లోపం ముఖంపై ముడతలు వేగంగా రావడానికి దోహదపడుతుంది. అయితే ముఖంపై ముడతలు, వృద్ధాప్య లక్షణాలను నివారించడానికి కొన్ని ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ సి: ఉసిరి, నారింజ, నిమ్మకాయ, కివీ, జామ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కొల్లాజెన్ (Collagen) ఉత్పత్తిని పెంచుతాయి. ఇది చర్మం బిగుతుగా ఉండటానికి సహాయపడుతుంది.
విటమిన్ ఇ: బాదం, సన్‌ఫ్లవర్ గింజలు, వేరుశనగలు, ఆకుకూరలు వంటివి చర్మానికి పోషణ అందించి ముడతలను తగ్గిస్తాయి.
బీటా-కెరోటిన్: క్యారెట్లు, టమాటాలు, బ్రకోలీ, పాలకూర వంటి రంగురంగుల పండ్లు, కూరగాయలలో ఉండే బీటా-కెరోటిన్ చర్మ రిపేర్‌కు సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: పండ్లు Vs కూరగాయలు.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా.. 90% మందికి తెలియదు!
ప్రోటీన్- కొవ్వులు: పనీర్, గుడ్లు, పాలు, పప్పులు వంటి ప్రోటీన్ ఆహారాలు కొల్లాజెన్ స్థాయిలను నిర్వహించి.. చర్మాన్ని బలంగా ఉంచుతాయి. చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ఆలివ్ ఆయిల్, అవకాడో వంటివి చర్మానికి పోషణనిస్తాయి.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ: గ్రీన్ టీ, పసుపు, అల్లం వంటివి చర్మ వాపును తగ్గిస్తాయి. చర్మం బిగుతుగా, తేమగా ఉండటానికి వారానికి రెండు సార్లు అలోవెరా, తేనె, దోసకాయతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా మంచిది.
నిద్ర: ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోవడం వలన చర్మం సహజంగా రిపేర్ అవుతుంది. అంతేకాకుండా ప్రతి ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వలన శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఇంకా ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగై ముఖం తాజాగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: దీవాళి తర్వాత వాడిన దీపాలు ఏం చేయాలో తెలుసా..?