Health Tips: పండ్లు Vs కూరగాయలు.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా.. 90% మందికి తెలియదు!

ఆరోగ్యకరమైన జీవనానికి పండ్లు, కూరగాయలు రెండూ అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. యాపిల్స్, అరటిపండ్లు జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి మంచివిగా చెబుతారు. పాలకూర, బ్రొకోలీ, క్యాబేజీ వంటి ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది.

New Update
fruits vs vegetables

Fruits Vs Vegetables

ఆరోగ్యకరమైన జీవనానికి పండ్లు, కూరగాయలు రెండూ అత్యవసరం. వీటిలో సహజ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మందికి వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం అనే సందేహం ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం కష్టమే.. ఎందుకంటే రెండూ అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పండ్లు, కూరగాయలు రెండూ విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలతో నిండి ఉంటాయి. పండ్లు మరియు కూరగాయలు.. ఆరోగ్యానికి ఏది మంచిదో నిపుణులు చెప్పే కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఆరోగ్యానికి ఏది ఉత్తమం..

పండ్ల ప్రయోజనాలు: పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. నారింజ, జామ, కివీస్ వంటి పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాపిల్స్, అరటిపండ్లు జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి మంచివిగా చెబుతారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవడం మంచిది.

కూరగాయలు: కూరగాయలలో చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. కానీ పీచుపదార్థాలు, ఐరన్, కాల్షియం, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పాలకూర, బ్రొకోలీ, క్యాబేజీ వంటి ఆకుపచ్చని కూరగాయలు శరీరం నుంచి విషపదార్థాలను తొలగించడంలో, బరువు తగ్గడంలో, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువు నిర్వహణలో కీలకం. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి అనేక వ్యాధులను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 3 నుంచి 5 గిన్నెల కూరగాయలు తినాలని సిఫార్సు చేస్తారు.

పండ్లు, కూరగాయలను పోల్చినప్పుడు.. కూరగాయలు అనేక విధాలుగా మరింత ప్రయోజనకరంగా చెబుతారు. వాటిలో తక్కువ చక్కెర, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల అవి దీర్ఘకాలిక పోషణను అందిస్తాయి. పండ్లు అల్పాహారంగా లేదా స్నాక్‌గా తీసుకోవచ్చు. కూరగాయలను భోజనంలో భాగం చేసుకోవాలి. సంపూర్ణ పోషణ కోసం రెండింటినీ సమతుల్యంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ధన్‌తేరాస్ నాడు దీపం వెలిగించడంతోపాటు ఈ 4 పనులు చేయండి.. మీకు డబ్బే డబ్బు!!

Advertisment
తాజా కథనాలు