/rtv/media/media_files/2025/10/22/diwali-diya-reuse-ideas-2025-10-22-18-41-04.jpg)
Diwali Diya Reuse Ideas
దీపావళి పండుగ ముగిసిన తర్వాత దీపాలను పారేయడం మనకు అలవాటు. అయితే ఈ మట్టి దీపాలను పారవేయకుండా.. వాటిని సులభంగా, తక్కువ ఖర్చుతో కూడిన శుభ్రపరిచే సాధనంగా మార్చుకోవచ్చు. ఈ ఆలోచన పర్యావరణానికి మేలు చేయడమే కాక.. రోజువారీ పనులలో సమయాన్ని, డబ్బును ఆదా చేస్తుంది. ముందుగా దీపాలలో ఉన్న వత్తులు, నూనెను తీసివేయండి. దీపాలకు అంటుకున్న జిడ్డును డిటర్జెంట్‌తో కడిగితే నురుగు వచ్చి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. దీనికి బదులుగా పొడి పిండి (Dry Flour) తీసుకుని దీపాలపై రుద్దండి. ఇది నూనెను తొలగిస్తుంది. ఆ తర్వాత.. ఈ దీపాలను గోరు వెచ్చని నీటిలో కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. మిగిలిపోయిన దీపావళి దీపాలను ఏం చేయాలో కొన్ని చిట్కాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
దీపాలను శుభ్రం చేసే సులభ మార్గం:
ముందుగా DIY సబ్బు స్క్రబ్ తయారు చేసుకోవాలి. శుభ్రం చేసిన దీపాలను ఉపయోగించి బర్న్ట్ పాత్రలను శుభ్రపరిచే అద్భుతమైన సాధనాన్ని తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో కొద్దిగా డిటర్జెంట్ (సర్ఫ్), బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి మెత్తని ముద్దలా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక దీపంలో నింపండి. పైన విరిగిన దీపం ముక్కను పెట్టి ఆరబెట్టండి. డిటర్జెంట్ పౌడర్‌ను నేరుగా దీపంలో నింపి పైన ముక్కను పెట్టవచ్చు. ద్రవ డిటర్జెంట్ అయితే మట్టితో కలిపి నింపాలి.
ఇది కూడా చదవండి: ఈ 3 పానియాలు తాగితే షుగర్ వ్యాధి పరార్.. అవేంటో తెలుసా?
కాలిన లేదా మరకలు పడిన పాత్రపై కొద్దిగా నీరు పోసి తయారు చేసిన ఈ దీపంతో రుద్దండి. డిటర్జెంట్, సోడా, వెనిగర్ మిశ్రమం సమర్థవంతంగా పనిచేసి పాత్రలను మెరిపిస్తుంది. ఎక్కువ శ్రమ లేకుండానే పాత్రలు శుభ్రపడతాయి. ఈ పద్ధతి ద్వారా పాత దీపాలను పారేయాల్సిన అవసరం ఉండదు, పైగా తయారు చేసిన ఈ సాధనం నెలల తరబడి ఉపయోగపడుతుంది. తయారు చేసిన దీపాలను గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకోవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: మన బామ్మల పద్ధతిలో పాత్రలు కడగడం తెలుసుకోండి.. వాటిని కొత్తగా మెరిసేలా చేయండి