Breakfast: పొద్దున్నే బ్రేక్ ఫాస్టులో ఇవి లాగిస్తే ఆయుష్షు, మెదడు సేఫ్‌

రోజంతా ఉల్లాసంగా, శక్తివంతంగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ మెనూలో మార్పులు అవసరం. చక్కెర పదార్థాలు, వైట్ బ్రెడ్ వంటి ఆహారాలు నిశ్శబ్దంగా జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. బ్లూబెర్రీ, గుడ్లు, గ్రీన్ టీ, వాల్‌నట్స్, సాల్మన్ వంటివి ఉదయం తీసుకోవాలి.

New Update
Breakfast

Breakfast

అల్పాహారం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. ఇది శక్తి, జీవక్రియ (మెటబాలిజం), దీర్ఘాయుష్షుకు సంబంధించిన కీలక సంకేతాలను శరీరానికి అందించే ఒక ముఖ్యమైన అంశం. రోజంతా ఉల్లాసంగా, శక్తివంతంగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ మెనూలో మార్పులు అవసరం. చక్కెర పదార్థాలు, వైట్ బ్రెడ్ వంటి ఆహారాలు నిశ్శబ్దంగా జీవిత కాలాన్ని తగ్గిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఉదయం తీసుకునే ఆహారం మెదడు పనితీరు వేగాన్ని, ఆయుష్షును నిర్ణయిస్తుందని చాలామందికి తెలియదు. అయితే మెదడుకు శక్తిని ఇచ్చే సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

అల్పాహారంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి:

బ్లూబెర్రీ (Wild Blueberries)లను ప్రకృతి మెదడు రక్షకులుగా పిలుస్తారు. వీటిలో యాంథోసైనిన్స్ అనే శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, మెదడు కణాలను రక్షిస్తాయి. ప్రతిరోజూ కొద్దిగా బ్లూబెర్రీస్ తీసుకుంటే.. జ్ఞాపకశక్తి దశాబ్దాల పాటు చురుకుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుడ్లు (Eggs) లో కోలిన్ అనే అద్భుతమైన పోషకం ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని నియంత్రించే అసిటైల్‌కోలిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా గుడ్లు తినడం వల్ల మెదడుకు శక్తి నెమ్మదిగా అందుతుంది, మెదడు క్షీణత తగ్గుతుంది. ప్రతిరోజూ కోలిన్ తీసుకున్న పెద్దలలో 12 వారాల్లోనే జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: బరువు తగ్గించుకోండి.. కాలేయ వ్యాధుల బారిన పడకుండా ఉండండి!!

 గ్రీన్ టీ (Green Tea)లో కెఫీన్‌తోపాటు L-థియానైన్ అనే అరుదైన పోషకం ఉంటుంది. ఈ అద్భుతమైన కలయిక మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. మధ్యాహ్న భోజనానికి ముందు కొద్దిగా గ్రీన్ టీ తాగడం వలన రోజంతా శక్తిస్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే వాల్‌నట్స్ (Walnuts) - సాల్మన్ (Salmon) మెదడు కణాల మధ్య సంభాషణకు ఒమేగా-3 కొవ్వులు చాలా అవసరం. ముఖ్యంగా వాల్‌నట్స్, సాల్మన్‌లో ఉండే DHA అనే కొవ్వు మెదడు కణాల నిర్మాణానికి ఉత్తమమైనది. ఉదయం కొన్ని వాల్‌నట్స్ లేదా కొద్దిగా సాల్మన్‌ను ఆహారంలో చేర్చుకుంటే మానసిక స్థితి మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఓట్స్ (Oats)లో ఫైబర్ శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో, శక్తిస్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఈ ఆహారాలు జీవక్రియను స్థిరీకరించి.. మెదడును సురక్షితంగా, ఆయుష్షును పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: ఈ డైట్ ప్లాన్ ఒకే రోజు ట్రై చేయండి.. శరీరంలోని అన్ని మలినాలను తరిమి కొడుతుంది

Advertisment
తాజా కథనాలు