Detox Diet Plan: ఈ డైట్ ప్లాన్ ఒకే రోజు ట్రై చేయండి.. శరీరంలోని అన్ని మలినాలను తరిమి కొడుతుంది

ఒక్క రోజులో శరీరాన్ని శుద్ధి చేసే డిటాక్స్ డైట్ ప్లాన్ చేసుకుంటే విషపదార్థాలు తొలగుతాయి. పెసరపప్పుతో కొద్దిగా అన్నం లేదా రోటీ కాలానుగుణంగా లభించే కూరగాయల కూర, పెరుగు తీసుకోవాలి. కొద్దిగా తక్కువగా తిని జీర్ణ అవయవాలకు విశ్రాంతి ఇవ్వాలి.

New Update
Detox Diet Plan

Detox Diet Plan

ప్రస్తుత జీవనశైలి కారణంగా మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలో రసాయనాలు, పురుగుమందులు, విషపూరితమైన లోహాలు (Heavy Metals) వంటి అనేక హానికర పదార్థాలు (Toxins) పేరుకుపోతున్నాయి. వీటిని బయటకు పంపకపోతే.. శరీరం తన పనితీరును సరిగ్గా నిర్వర్తించలేదు. ఫలితంగా వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో బరువుగా అనిపించడం, జీర్ణక్రియ సరిగా లేకపోవడం, తరచుగా అనారోగ్యం, చర్మం నిర్జీవంగా ఉండటం లేదా శక్తి తగ్గిపోవడం వంటి సంకేతాలు కనిపిస్తే..శరీరానికి డిటాక్స్ అవసరమని అర్థం చేసుకోవాలి. శరీరంలోని హానికర పదార్థాలను తొలగించడానికి ఒక సరళమైన, ప్రభావవంతమైన ఒకరోజు డిటాక్స్ డైట్ ప్లాన్‌ చేసుకోవాలి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

డిటాక్స్ డైట్ ప్లాన్:

ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరు వెచ్చని జీలకర్ర నీటిని తాగాలి. జీలకర్ర నీరు కాలేయాన్ని శుద్ధి చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని కోసం రాత్రి నానబెట్టిన 1 చెంచా జీలకర్రను ఉదయం మరిగించి తాగాలి. తర్వాత 10 నిమిషాల పాటు తేలికపాటి యోగా క్యాట్-కౌ స్ట్రెచ్, భుజంగాసనం, ప్రాణాయామం అనులోమ-విలోమ, కపాలభాతి చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి విషపదార్థాలు తొలగుతాయి. అయితే టీ, కాఫీ లేదా భారీ ఆహారాలు తీసుకోవద్దు. ఆకలిగా ఉంటే పండ్లను మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు మజ్జిగలో నల్ల ఉప్పు.. వేయించిన జీలకర్ర పొడి, కొత్తిమీర కలిపి తీసుకోవాలి. మజ్జిగ జీర్ణక్రియకు చాలా మంచిది. తేలికపాటి భోజనం చేయాలి. పెసరపప్పుతో కొద్దిగా అన్నం లేదా రోటీ కాలానుగుణంగా లభించే కూరగాయల కూర, పెరుగు తీసుకోవాలి. కడుపు నిండా తినకుండా.. కొద్దిగా తక్కువగా తినడం ద్వారా జీర్ణ అవయవాలకు విశ్రాంతి ఇవ్వాలి. 

ఇది కూడా చదవండి: బ్లాక్ కాఫీతో కాలేయానికి రక్షణ.. సిర్రోసిస్, క్యాన్సర్ ముప్పు తగ్గుతుందంటున్న నిపుణులు!!

అంతేకాకుండా రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. సాదా నీరు కాకుండా నిమ్మరసం వంటి సహజ పానీయాలు కూడా తీసుకోవచ్చు. ఒక అల్లం ముక్క 4-5 తులసి ఆకులను నీటిలో మరిగించి.. కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలిపి తాగాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. వీలైతే సాయంత్రం ఒక బకెట్ నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ వేసి 10-15 నిమిషాలు పాదాలు నానబెట్టాలి. ఇది శరీరానికి విశ్రాంతినిచ్చి, టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్, వేయించిన మఖానా తీసుకోవాలి. తేలికగా, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. దేశీ నెయ్యితో చేసిన పెసరపప్పు కిచిడీ, గోధుమ గంజి. ఈ డిటాక్స్ ప్లాన్‌ను ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి 15 రోజులకు లేదా నెలకు ఒకసారి పాటించవచ్చు. అనారోగ్యకరమైన జీవనశైలి, దీర్ఘకాలిక వ్యాధులు లేదా స్థూలకాయం ఉన్నవారు దీనిని వారానికి ఒకసారి తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: ఉదయం ఖాళీ కడుపుతో ఈ గింజల పొడి తీసుకుంటే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

Advertisment
తాజా కథనాలు