Skin Vs Bumps: చర్మంపై గడ్డలు ఉన్నాయా? అయితే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు

శరీరంలో గడ్డ నెమ్మదిగా పెద్దగా అవుతుంటే.. నొప్పి,రంగు మారుతుంటే తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు లైపోమా, ఇతర రకాల క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉందని సూచిస్తాయి. చర్మం కింద ఏర్పడే కొవ్వు గడ్డలు హానిరహితంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Skin Vs Bumps

Skin Vs Bumps

శరీరంలో ఎక్కడైనా చిన్న, మృదువైన గడ్డ కనిపిస్తే మొదటగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ గడ్డ నెమ్మదిగా పెద్దగా అవుతుంటే.. నొప్పి వస్తుంటే లేదా రంగు మారుతుంటే అది ఒక తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. వైద్య నిపుణుల ప్రకారం.. ఇటువంటి లక్షణాలు లైపోమా (కొవ్వు గడ్డ) లేదా ఇతర రకాల క్యాన్సర్‌(Cancer) గా మారే ప్రమాదం ఉందని సూచిస్తాయి. చాలా సందర్భాలలో చర్మం(Skin) కింద ఏర్పడే కొవ్వు గడ్డలు హానిరహితంగా ఉంటాయి. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మంపై గడ్డలు ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త:

చిన్న గడ్డలు సాధారణంగా ప్రమాదకరం కావు. కానీ గడ్డ నిమ్మకాయ కంటే పెద్దదిగా పెరిగినా లేదా ఆకారం మారినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాకుండా మృదువైన, చర్మం రంగులో ఉండే గడ్డలు సాధారణంగా ప్రమాదకరం కాదు. కానీ అది గట్టిగా మారినా.. ఎరుపు లేదా నీలం రంగులో కనిపించినా, చర్మం బిగుతుగా మారినా వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు చెబుతున్నారు. కొన్ని వారాల్లోనే గడ్డ పరిమాణం రెట్టింపు అయితే అది ట్యూమర్, ఇన్ఫెక్షన్ లేదా క్యాన్సర్ లక్షణం కావచ్చు. సాధారణ కొవ్వు గడ్డలో నొప్పి ఉండదు. కానీ గడ్డలో నొప్పి ఉంటే లేదా అది కండరాలు, నరాలు లేదా ఎముకలపై ఒత్తిడి కలిగిస్తుంటే అది ఆందోళన కలిగించే విషయని చెబుతున్నారు. గడ్డ ఎర్రగా మారి, దాని నుంచి రక్తం లేదా చీము కారుతున్నా.. అది పుండులా మారినా అది ప్రమాదకరమైన సార్కోమా (క్యాన్సర్)కి సంకేతం కావచ్చు. గడ్డను గుర్తించిన వెంటనే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం మంచిది. 

ఇది కూడా చదవండి: తప్పుడు ఫుడ్ కాంబినేషన్లతో జాగ్రత్త.. వీటిని కలిపి తింటే..!!

దీనివల్ల అది కొవ్వు గడ్డ, ఇన్ఫెక్షన్, ట్యూమర్ అని తెలుస్తుంది. అవసరమైతే.. ఎంఆర్‌ఐ, పీఈటీ సీటీ స్కాన్ చేయించడం ద్వారా గడ్డ అంతర్గత నిర్మాణం, వ్యాప్తిని తెలుసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. శరీరంలో గడ్డ ఉండి అది పెరుగుతున్నా, నొప్పి ఉన్నా, దాని రంగు, ఆకృతిలో మార్పులు కనిపిస్తున్నా దానిని నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సందర్భాలు తీవ్రమైన వ్యాధులకు ప్రారంభ సంకేతాలు కావచ్చు.  అయితే క్యాన్సర్ అంటే శరీరంలోని కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరగడం. ఈ అసాధారణ కణాలు కణితిగా మారి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ రావొచ్చు. క్యాన్సర్ రావడానికి ధూమపానం, మద్యం, రేడియేషన్, కొన్ని వైరస్‌లు కరాణం. కానీ క్యాన్సర్ వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ప్రస్తుతం క్యాన్సర్‌కు చాలా చికిత్సలు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, సర్జరీ వంటివి సరైన సమయంలో రోగ నిర్ధారణ, చికిత్స అందిస్తే క్యాన్సర్‌ను నయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అధిక కాఫీ తాగుతున్నారా..? ఈ ప్రమాదకర రోగాలు ఎక్కువైనట్లే..!!

health tips in telugu | latest health tips | best-health-tips | skin-cancer | latest-telugu-news | healthy life style | human-life-style

Advertisment
తాజా కథనాలు